News September 17, 2024
2035 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం: భట్టి

2035 నాటికి తెలంగాణ రాష్ట్రం 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో ఆర్థిక, సామాజిక శ్రేయస్సుకు రిలయబుల్ ఎనర్జీ పునాది లాంటిదని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ, ఫోర్త్ సిటీ, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందన్నారు.
Similar News
News December 20, 2025
ఇంటి నుంచే యూరియా బుకింగ్: కలెక్టర్

రైతులు యూరియా కోసం ఇబ్బంది పడకుండా రూపొందించిన కొత్త యాప్పై కలెక్టర్ అనుదీప్ మంగళవారం సమీక్షించారు. రబీ సీజన్ నుంచి రైతులు తమ ఇంటి వద్ద నుంచే మొబైల్ యాప్ ద్వారా యూరియాను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ యాప్లో డీలర్ల వద్ద ఉన్న నిల్వల (స్టాక్) వివరాలను కూడా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చని పేర్కొన్నారు.
News December 20, 2025
ఖమ్మం ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 22న మచిలీపట్నం నుంచి ప్రయాగ్రాజ్ వెళ్లే వన్-వే స్పెషల్ రైలు (07401)కు ఖమ్మం రైల్వే స్టేషన్లో హాల్టింగ్ కల్పించారు. ఈ ప్రత్యేక రైలు గుడివాడ, విజయవాడ మీదుగా ప్రయాణిస్తూ ఖమ్మం చేరుకుంటుంది. ఇక్కడితో పాటు వరంగల్ స్టేషన్లోనూ ఈ రైలు ఆగుతుందని అధికారులు వెల్లడించారు.
News December 20, 2025
ఖమ్మం: ‘ఆమె’దే హవా

ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మహిళలు సత్తాచాటారు. మొత్తం 566 జీపీలకు గాను 297 స్థానాలు మహిళలు గెలిచారు. కాగా అత్యధికంగా తిరుమలాయపాలెంలో 40 జీపీలు ఉంటే 22, రఘునాథపాలెంలో 37 జీపీలకు 20 జీపిల్లో మహిళలు విజయం సాధించారు. అలాగే వైరా నియోజకవర్గంలో జనరల్ స్థానాల్లో ఐదుగురు బీసీ, ముగ్గురు ఎస్టీ మహిళలు, సత్తుపల్లిలో ఇద్దరు బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ మహిళ అభ్యర్థి విన్ అయ్యారు.


