News March 22, 2025
2047లక్ష్య సాధన దిశగా ముందడుగు వేద్దాం: లంకా

వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్య సాధన దిశగా ముందడుగు వేద్దామని, లక్ష్యాల సాధనలో అధికారులే రథ సారథులని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై సమీక్ష జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మశ పాల్గొన్నారు.
Similar News
News October 19, 2025
‘K-Ramp’ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని తెరకెక్కించిన ‘K-Ramp’ మూవీ నిన్న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ రాబట్టినట్లు Sacnilk ట్రేడ్ వెబ్‌సైట్ తెలిపింది. ఇండియాలో రూ.2.15 కోట్లు(నెట్ కలెక్షన్స్) వసూలు చేసినట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో 37.10% ఆక్యుపెన్సీ నమోదు చేసినట్లు వెల్లడించింది.
News October 19, 2025
స్టార్ క్యాంపెయినర్లుగా కొండా సురేఖ, సీతక్క

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ క్యాంపెయినర్లను నియమించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ తదితరులు స్టార్ క్యాంపెయినర్లుగా నియమితులయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
News October 19, 2025
మరికల్: గత నెల 23న విడుదల.. 8 ఇళ్లలో చోరీ

గత నెల 23న జైలు నుంచి విడుదలై 8 చోరీలకు పాల్పడిన దొంగను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరికల్ మండలం జిన్నారానికి చెందిన ముద్దంగి భీమేశ్(25) చందానగర్, దుండిగల్, మక్తల్, చైతన్యపురి, హయత్‌నగర్ పలు PSలలో మొత్తం 50కి పైగా కేసులు ఉన్నాయి. రాత్రుళ్లు ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, బైక్‌లు ఎత్తుకెళ్లే దొంగగా గుర్తించారు. నిందితుడి నుంచి 2బైక్‌లు, 8 గ్రాముల బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు.