News March 22, 2025
2047లక్ష్య సాధన దిశగా ముందడుగు వేద్దాం: లంకా

వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్య సాధన దిశగా ముందడుగు వేద్దామని, లక్ష్యాల సాధనలో అధికారులే రథ సారథులని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై సమీక్ష జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మశ పాల్గొన్నారు.
Similar News
News April 22, 2025
NGKL: ఆశాకార్యకర్తను ఘనంగా సన్మానించిన ఆర్టీసీ ఛైర్మన్

నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో ఆర్టీసీ బస్సులో మహిళకు ప్రసవం చేసి, తల్లిబిడ్డలను క్షేమంగా కాపాడిన ఎల్లూరు పీహెచ్‌సీ ఆశాకార్యకర్త కాంతమ్మను హైదరాబాద్ ఆర్టీసీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనర్ ఐపీఎస్ సన్మానించారు. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌ను అభినందించారు. మీరు చేసిన సేవ మీ కుటుంబాన్ని భవిష్యత్తులో తప్పక కాపాడుతుందని అన్నారు.
News April 22, 2025
HYDలో SRనగర్ CI ది గ్రేట్

రూల్స్ ఫాలో అవకపోతే ట్రాఫిక్ పోలీసులు ఎంత కఠినంగా ఉంటారో తెలిసిందే. నగరవాసులకు ఆపద వస్తే మాత్రం అంతకుమించి మానవత్వం చూపిస్తారు. అలాంటి ఘటనే మన SRనగర్‌లో జరిగింది. ఉమేశ్ చంద్ర విగ్రహం వద్ద సోమవారం ఓ మైనర్ వాహనం నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. విధుల్లో ఉన్న CI సైదులు ఇది గమనించాడు. బాలుడిని పైకి లేపి FIRST AID చేశారు. ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించారు. బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి, ఇంటికి పంపారు.
News April 22, 2025
ప్రధాని మోదీ గ్రేట్ లీడర్: జేడీ వాన్స్

ఢిల్లీలో నిన్న రాత్రి PM మోదీ, US ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు Xలో స్పందించారు. ‘ట్రంప్‌తో మీటింగ్‌లో చర్చించిన అంశాల పురోగతిపై వాన్స్‌ను అడిగి తెలుసుకున్నా. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం మన ప్రజల భవిష్యత్‌తో పాటు ప్రపంచానికి తోడ్పడుతుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘మోదీ గొప్ప లీడర్. భారత ప్రజలతో స్నేహం, సహకారం బలోపేతానికి కృషి చేస్తా’ అని వాన్స్ పేర్కొన్నారు.