News March 18, 2024
2,049 ప్రభుత్వ ఉద్యోగాలు.. APPLY చేసుకోండి

SSCలో 2,049 ఉద్యోగాల అప్లికేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఈరోజు రాత్రి 11 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు. విద్యార్హత: పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ. ప్రోగ్రామ్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, లైబ్రేరియన్, ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ లాంటి పోస్టులున్నాయి. మే 6 నుంచి 8 వరకు పరీక్షలు ఉంటాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
Similar News
News September 7, 2025
అమరావతికి వచ్చి చూస్తే తెలుస్తుంది: నారాయణ

AP: రాజధాని అమరావతిలో భవనాల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. IAS అధికారుల టవర్లు త్వరలోనే పూర్తవుతాయన్నారు. రోడ్లు, కాలువల పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అమరావతి మునిగిపోయిందని, పనులు జరగట్లేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏసీ రూముల్లో కూర్చోకుండా ఇక్కడకు వచ్చి చూస్తే ఎంత మంది, ఎన్ని కంపెనీలు పని చేస్తున్నాయో తెలుస్తుందన్నారు.
News September 7, 2025
చంద్రగ్రహణం వేళ చదవాల్సిన మంత్రాలు

ఈరోజు రాత్రి చంద్ర గ్రహణం సంభవించనుంది. ఈ సమయంలో ‘ఓం శ్రాం శ్రీం సః చంద్రమసే నమః’ అనే మంత్రాన్ని జపిస్తే చంద్రుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘మహా మృత్యుంజయ మంత్రం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. శివారాధన చాలా శక్తిమంతమైనది. ఓం నమః శివాయ అనే మంత్రం రాహు-కేతువుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం గం గణపతయే నమః మంత్రాలు కూడా ప్రతికూల శక్తులను తొలగిస్తాయి’ అని అంటున్నారు.
News September 7, 2025
ప్రశాంతంగా నిమజ్జనం.. అభినందించిన సీఎం

TG: హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. 9 రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.