News June 4, 2024
2,08,460 ఓట్ల ఆధిక్యంలో బలరాం నాయక్

మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ 2,08,460 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవితకు 1,62,623 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్‌కు 3,71,083 ఓట్లు వచ్చాయి. కాసేపట్లో మహబూబాబాద్ చివరి ఫలితం విడుదల కానుంది.
Similar News
News November 27, 2025
వరంగల్: కొత్త విత్తన బిల్లుపై అభిప్రాయాలు సేకరించిన కలెక్టర్

కొత్త విత్తన బిల్లు-2025 ముసాయిదాపై రైతులు, విత్తన వ్యాపారులు, ఉత్పత్తిదారుల అభిప్రాయాలను సేకరించామని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ఈరోజు వరంగల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సంప్రదింపుల సమావేశంలో బిల్లులోని సెక్షన్లు, క్లాజులపై విస్తృతంగా చర్చించారు. హాజరైన వాటాదారులు ప్రతి అంశంపై తమ సూచనలు తెలియజేశారు. వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
News November 27, 2025
Te-Poll యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: వరంగల్ కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు పూర్తి సమాచారాన్ని వేగంగా, సులభంగా అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ ఇప్పుడు గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డా.సత్యశారద తెలిపారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం వివరాలు, ఓటర్ స్లిప్ నమోదు స్థితి వంటి కీలక సమాచారాన్ని ఒకే యాప్ ద్వారా తెలుసుకునే విధంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన యాప్ ఇది అని పేర్కొన్నారు.
News November 27, 2025
వరంగల్: పంచాయతీ ఎన్నికలు.. కలెక్టర్ సమీక్ష

వరంగల్ జిల్లా పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను మరింత పటిష్ఠంగా సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించిన రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషనర్, జిల్లా పరిశీలకురాలు బి.బాల మాయదేవి (IAS) వరంగల్ కలెక్టరేట్కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పూలమొక్క అందించి ఆమెకు ఘన స్వాగతం పలికారు. తర్వాత కలెక్టరేట్ ఛాంబర్లో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.


