News October 7, 2025

నార్త్ వెస్టర్న్ రైల్వేలో 2,094 పోస్టులు

image

నార్త్ వెస్టర్న్ రైల్వే 2,094 అప్రెంటిస్ పోస్టుల ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు నవంబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. జైపుర్‌లోని RRC ఈ నియామకాలు చేపట్టనుంది. అభ్యర్థుల వయసు 15నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు రూ.100, SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు.

Similar News

News April 6, 2026

చైనాను మించిన క్రీడా సదుపాయాలు HYDలో ఉండాలి: CM

image

TG: ఒలింపిక్స్ నిర్వహించేలా, చైనాను మించిన క్రీడా సదుపాయాలు HYDలో ఉండాలని రాష్ట్ర స్పోర్ట్స్ హబ్ ప్రతినిధులకు CM రేవంత్ సూచించారు. గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధిపై ఆయన సమీక్షించారు. ‘క్రీడారంగంలో HYDను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలి. జూన్ 2న స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తాం. ఆటగాళ్లు నేరుగా స్టేడియానికి చేరుకునేలా హెలిప్యాడ్‌తో పాటు ప్రపంచ స్థాయి సదుపాయాలు ఏర్పాటు చేయాలి’ అని ఆదేశించారు.

News April 6, 2026

ఏప్రిల్ 6: చరిత్రలో ఈరోజు

image

1886: HYD చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జననం
1896: ఏథెన్స్‌లో ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభం
1928: DNA నిర్మాణాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ జననం
1938: కీటక శాస్త్రవేత్త, పద్మశ్రీ&పద్మభూషణ్ అవార్డుల గ్రహీత వినోద్ ప్రకాశ్ శర్మ జననం
1956: భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ జననం
2011: సినీ నటి సుజాత మరణం (ఫొటోలో)

News April 6, 2026

PHOTO GALLERY: చెన్నైvsRCB మ్యాచ్

image

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన CSKvsRCB మ్యాచుకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, RCB ఓనర్ అనన్య బిర్లా, మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వంటి ప్రముఖులు సైతం మ్యాచును ఎంజాయ్ చేశారు. 2024 సీజన్ నుంచి చెన్నైపై RCBకి ఇది వరుసగా నాలుగో విజయం. ఈ మ్యాచ్ ఓడటానికి తానే కారణమని, బ్యాటింగ్‌లో తాను మంచి స్కోర్ చేయాల్సిందని CSK కెప్టెన్ రుతురాజ్ అన్నారు.