News January 19, 2026
21న జిల్లా అభివృద్ధి, పర్యవేక్షణ కమిటీ సమావేశం: కలెక్టర్

జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఈనెల 21న జరగనుందని కలెక్టర్ దినేశ్ కుమార్ సోమవారం తెలిపారు. ఛైర్‌పర్సన్ డాక్టర్ గుమ్మ తనూజరాణి అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటల నుంచి జరగనున్న ఈ సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎంపీపీలు హాజరుకావాలని కోరారు. అన్ని విభాగాల అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కావాలన్నారు.
Similar News
News April 5, 2026
పార్వతీపురం: ఏనుగుల సంచారం.. అటవీశాఖ సూచనలు

గరుగుబిల్లి మండలం గిజబ గ్రామ పరిసర అరటి తోటల్లో, వరి పొలాల్లో ఆదివారం ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు, రైతులు పొలాలకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
News April 5, 2026
BREAKING.. నిర్మల్‌లో అగ్ని ప్రమాదం.. ఇద్దరి మృతి

నిర్మల్ బంగల్పేట్ <<19570362>>డబుల్ <<>>బెడ్ రూమ్ ఇళ్లలో శనివారం రాత్రి ఫ్రిజ్ పేలిన ఘటనలో గాయపడిన ఇద్దరు ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులను విజయ్, ఒక మహిళగా స్థానికులు గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్ ఒక్కసారిగా పేలి మంటలు వ్యాపించడంతో వీరు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోవడంతో కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News April 5, 2026
వనపర్తి: బాధితుల వద్దకే FIR…!

వనపర్తి జిల్లాలో సరికొత్త పోలీసింగ్ వ్యవస్థకు ఎస్పీ సునీతా రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇకపై బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఘటనా స్థలంలోనే ఫైర్ నమోదు చేయనున్నారు. తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు పోలీసులు నేరుగా ఘటనా స్థలానికి చేరుకుని అక్కడే ఫిర్యాదు తీసుకొని ఆన్‌సైట్ ఫైర్ చేయనున్నారు. సమయం వృథా కాకుండా, సాక్ష్యాధారాలు తారుమారు కాకముందే సేకరించే అవకాశం ఉంటుందని తెలిపారు.


