News October 20, 2025
21న పోలీస్ అమరవీరుల సంస్మరణకు సీఎం రేవంత్: డీజీపీ

అక్టోబర్ 21 గోషామహల్ పోలీస్ స్టేడియంలో జరిగే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమానికి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి హాజరవనున్నారని డీజీపీ శివధర్ తెలిపారు. కార్యక్రమం ఉ.9.30 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు. అక్టోబర్ 21- 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Similar News
News October 20, 2025
దీపావళి శాంతియుతంగా జరుపుకోవాలి: ASF SP

దీపావళి వెలుగుల పండుగగా ప్రతి ఇంటిలో ఆనందం, ఐకమత్యం, సంతోషం నిండాలని ఆకాంక్షించారు. గిరిజనుల సాంప్రదాయ పండుగ దండారి గుస్సాడి సందర్భంగా గిరిజన సోదరులు, కళాకారులకు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ పండుగలను శాంతి, ఐకమత్యం, సోదరభావంతో జరుపుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
News October 20, 2025
అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి: ASF కలెక్టర్

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో పండుగను ఆనందంగా సురక్షితంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
News October 20, 2025
రాష్ట్రంలో తగ్గిన నూనె గింజ పంటల సాగు విస్తీర్ణం

AP: రాష్ట్రంలో ఈ ఏడాది నూనెగింజ పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ ఏడాది 17 లక్షల ఎకరాల్లో నూనెగింజల పంటలను సాగుచేయాలనుకోగా 6.50 లక్షల ఎకరాల్లో మాత్రమే వేరుశనగతో పాటు ఇతర నూనెగింజల పంటలు సాగయ్యాయి. వరి 38.97 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పత్తి 11 లక్షల ఎకరాల్లో, చెరకు 30 వేల ఎకరాలకే పరిమితమైంది. మొక్క జొన్న, సజ్జ, చిరుధాన్యాలు, కందులు, ఆముదం, జూట్ వంటి పంటలు లక్ష్యానికి మించి సాగయ్యాయి.