News July 18, 2024
21 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి నీటిమట్టం

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. గురువారం ఉదయం గోదావరి వరద నీటిమట్టం 21 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వరద ఉద్ధృతి ఎక్కువ ఉండడంతో భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Similar News
News February 27, 2026
BREAKING.. డీజీపీ శివధర్ రెడ్డి ఖమ్మం పర్యటన రద్దు

డీజీపీ శివధర్ రెడ్డి నేటి ఖమ్మం పర్యటన అనివార్య కారణాలతో రద్దయింది. కొత్త పోలీస్ భవనాల ప్రారంభోత్సవం, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పర్యటన మళ్లీ ఎప్పుడు ఉండేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
News February 27, 2026
సర్పంచ్ నుంచి జిల్లా స్థాయికి

కారేపల్లి పోలంపల్లి సర్పంచ్ హేమలత బాలాజీ నాయక్‌కు అరుదైన గౌరవం దక్కింది. గ్రామాభివృద్ధిలో ఆమె చూపుతున్న చొరవను గుర్తిస్తూ జిల్లా ‘దిశ’ కమిటీ సభ్యురాలిగా ప్రభుత్వం ఎంపిక చేసింది. సామాన్య సర్పంచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టి, జిల్లా స్థాయి వేదికకు ఎంపికవ్వడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమస్యలను జిల్లా స్థాయిలో వినిపించి, మరిన్ని నిధులు సాధిస్తానని ఆమె ఆకాంక్షించారు.
News February 27, 2026
ఏరుగట్లలో గుప్తనిధుల కలకలం..!

పెనుబల్లి మండలం ఏరుగట్లలో గుప్తనిధుల వేట కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి ముత్యాలమ్మ గుడి సమీపంలో క్షుద్రపూజలు నిర్వహిస్తూ, జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో నిందితులు పట్టుబడ్డారు. ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకున్న వీఎం బంజర్ పోలీసులు..ఘటనా స్థలంలో జేసీబీ, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


