News November 21, 2024
21 కేసుల్లో దొంగలించిన సొత్తు రికవరీ.. 13 మంది అరెస్టు
కర్నూలు జిల్లాలోని 21 కేసుల్లో దొంగలించిన సొత్తును ఆదోని ఒకటో పట్టణ పోలీసులు రికవరీ చేసి 13 మందిని అరెస్టు చేశారని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. రూ.24 లక్షల విలువ గల బైక్‌లను ఇదివరకే రికవరీ చేశారన్నారు. ఈరోజు రూ.41 లక్షల ప్రాపర్టీ రికవరీ చేయడంలో ఆదోని సబ్ డివిజన్ పోలీసులు బాగా పని చేశారన్నారు. ఆదోని డీఎస్పీ సోమన్న, సీఐ శ్రీరామ్, సిబ్బందిని అభినందించారు.
Similar News
News November 27, 2024
ఐపీఎల్‌లో మన కర్నూలు కుర్రాళ్లెక్కడ?
IPLకు ఉన్న క్రేజ్ వేరు. ప్రతి క్రికెటర్ ఆ టోర్నీలో ఆడాలని కల కంటారు. అలాంటి IPLలో కర్నూలు జిల్లా క్రీడాకారుల భాగస్వామ్యం లేదు. జిల్లాలో యువ క్రికెటర్లు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో నైపణ్యాలు లేకపోవడంతో వేలంలో పాల్గొనే అవకాశం కూడా దక్కలేదు. ఇప్పటికైనా జిల్లాలో టాలెంట్ ఉన్న ప్లేయర్లను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు జిల్లాకు చెందిన అంజలి, అనూష మహిళా క్రికెట్‌లో సత్తా చాటుతున్నారు.
News November 27, 2024
పత్తికొండలో వ్యభిచార గృహంపై దాడులు
పత్తికొండలోని గుత్తి రోడ్డులో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై సీఐ జయన్న ఆధ్వర్యంలో ఎస్ఐ గోపాల్, పోలీసు సిబ్బంది మంగళవారం దాడులు నిర్వహించారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలితో పాటు ఐదుగురు విటులను అదుపులోకి తీసుకుని, ఒక యువతిని ఐసీడీఎస్‌కు అప్పగించినట్లు సీఐ జయన్న తెలిపారు. విటులు, వ్యభిచార గృహం నిర్వాహకురాలిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
News November 27, 2024
డోన్ రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫారం సమీపంలో మృతదేహం
డోన్ రైల్వే స్టేషన్ 4f ఫ్లాట్‌ఫారం సమీపంలో యువకుని(23) మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ప్యాపిలి మండలం రాచర్లకు చెందిన యువకుడిగా పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం జీఆర్‌పీ ఎస్ఐ 9030481295ను సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.