News October 21, 2024

21 నుంచి వైవీయూ డిగ్రీ ఒకేషనల్ పరీక్షలు

image

వైవీయూ పరిధిలోని డిగ్రీ కళాశాలలో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ ఒకేషనల్ రెండవ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు వైవీయూ పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి తెలిపారు. ఎం.ఎల్.టి, డైరీ సైన్స్ చదివే విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలన్నారు. హాల్ టికెట్లను చదువుతున్న కళాశాల నుంచి పొందాలన్నారు. పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించనున్నామని తెలిపారు.

Similar News

News October 26, 2025

రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

image

కడప జిల్లాలో అధిక వర్షపాతం కృషి అవకాశం ఉన్నందున సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి రాకూడదని తెలిపారు. వృద్ధులు మహిళలు వికలాంగులు రావద్దని అన్నారు.

News October 25, 2025

కడప జిల్లాకు రెడ్ అలెర్ట్.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

భారీ వర్షాల నేపథ్యంలో కడప జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో JC అదితి సింగ్, జిల్లా అధికారులు అలెర్ట్ అయ్యారు. అత్యవసర సహాయ చర్యల కోసం కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
కడప కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 08562-246344
కడప ఆర్డీవో కార్యాలయం: 08562-295990
జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం: 95028 36762
బద్వేలు ఆర్డీవో కార్యాలయం: 6301432849
పులివెందుల ఆర్డీవో కార్యాలయం: 8919134718

News October 25, 2025

కడప జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవులు

image

‘మోంతా’ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు కడప JC అదితి సింగ్ శనివారం తెలిపారు. తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం కూడా సెలవు కావడంతో వరుసగా 3 రోజులు సెలవు వచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.