News December 10, 2024

21 నుంచి SVU పరీక్షల ప్రారంభం

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 2వ తేదీ వరకు కొనసాగుతాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

Similar News

News January 16, 2025

నా చుట్టూ తిరిగితే పదవులు రావు: నారా లోకేశ్

image

నారావారిపల్లెలో బుధవారం ఉత్తమ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన చుట్టూ తిరిగితే పదవులు రావని తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయని మరోసారి స్పష్టం చేశారు. నాయకుల పనితీరుపై వాట్సప్ ద్వారా ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు చెప్పారు. పొలిట్‌బ్యూరోలో ప్రతి రెండేళ్లకు ఒకసారి 30 శాతం కొత్తవారు రావాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు.

News January 15, 2025

ఏర్పేడు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

ఏర్పేడు మండలం మేర్లపాక హైవే సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. అనంతరం ఏర్పేడు పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తిది నెల్లూరు నగరంలోని స్టోన్‌హౌన్‌పేటగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 14, 2025

చంద్రగిరి: భయంతో బాలుడు ఆత్మహత్య

image

చంద్రగిరి పట్టణంలోని బీడీ కాలనీలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. సమీర్(12) అనే బాలుడు తన స్నేహితుడితో కలిసి మేడపై గాలిపటం ఎగరవేస్తున్నారు. ఈ క్రమంలో సమీర్ స్నేహితుడు కిందపడి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో సమీర్‌పై అతని మామ కోపంతో గదిలో పెట్టి తలుపు వేశాడు. తిరిగి వచ్చి కొడుతాడన్న భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.