News September 9, 2024
21 ఏళ్ల తర్వాత HYD సీపీగా డీజీపీ ర్యాంక్ అధికారి
HYD పోలీస్ కమిషనర్‌గా మరోసారి నేడు CV ఆనంద్ (డీజీపీ ర్యాంక్ IPS) తన బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాదిలో జరిగిన సీపీ మార్పుల్లో ఒకటి, నాలుగో స్థానాలు ఆయనవే. 2,3 స్థానాల్లో సందీప్ శాండిల్య, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అంతేకాక 21 ఏళ్ల తర్వాత డీజీపీ స్థాయి అధికారిని HYD నగర పోలీస్ కమిషనర్‌గా నియమించడం ప్రత్యేక విషయం. నూతన సీపీకి నగర ప్రజలు X వేదికగా స్వాగతం పలికారు.
Similar News
News December 30, 2024
HYD: మాజీ ఎంపీని పరామర్శించిన మంత్రులు
నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యే వివేక్‌లు సోమవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మందా జగన్నాథంకి మంచి చికిత్స అందించాలని డాక్టర్ల బృందానికి మంత్రులు సూచించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
News December 30, 2024
HYD: న్యూ ఇయర్.. రిసార్టులకు ఫుల్ డిమాండ్..!
న్యూ ఇయర్ వేడుకలకు రిసార్టులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రేపు రాత్రి నుంచి 2025 న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు HYD శివారులోని మొయినాబాద్, చేవెళ్ల, కోటిపల్లి, శామీర్‌పేట, భువనగిరి, పాకాల, శ్రీశైలం, గోల్కొండ, మోకిలా ప్రాంతాల్లో రిసార్టులను బుక్ చేసుకున్నారు. ప్రేమ జంటల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రిసార్టుల్లో ఒక్క రోజుకు రూ.10-40 వేలుగా ఛార్జీలు ఉన్నాయి.
News December 30, 2024
గ్రేటర్లో ఓవైపు చలి.. మరోవైపు కరెంటు వినియోగం
గ్రేటర్ HYDలో ఓవైపు చలి పెరుగుతూ వస్తుంటే దానికి తగ్గట్టుగానే విద్యుత్ వినియోగం పెరుగుతూ వస్తున్నట్లు అధికారులు తెలిపారు. HYDలో 3 వేల మెగావాట్లకుపైగా విద్యుత్ వినియోగం జరుగుతున్నట్లు పేర్కొంది. దాదాపు 56 యూనిట్లకు పైగా రికార్డులు నమోదు కాగా.. విద్యుత్ కనెక్షన్లు పెరగడం, పరిశ్రమల వాడకం, ఉదయం పూట ఇళ్లలో గీజర్లు వినియోగించడం కారణాలుగా అధికారులు చెప్పుకొచ్చారు.