News April 10, 2025

21-24 ఏళ్ల యువతకు కామారెడ్డి కలెక్టర్ గుడ్ న్యూస్

image

టాప్ 500 కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం రెండో దశ ప్రారంభానికి జిల్లాలో ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. పథకానికి దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 21-24 ఏళ్లు ఉండాలన్నారు. కుటుంబ సభ్యులు ఎవరూ ప్రభుత్వ ఉద్యోగయి ఉండకూడదన్నారు. అర్హత గల వారు, సరైన ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.

Similar News

News November 26, 2025

కర్నూలు జిల్లా నుంచి అధ్యక్షా.. అనేది వీరే..!

image

సంవిధాన్ దివస్-రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని (మాక్ అసెంబ్లీ) కల్పించారు. బుధవారం కర్నూలు జిల్లా నుంచి అసెంబ్లీలో మాట్లాడేందుకు జిల్లా ఎమ్మెల్యేలు (విద్యార్థులు) సిద్ధమయ్యారు. దయాన, లోకేశ్వర్ రెడ్డి, గాయత్రి, నవనీత్ కుమార్, వీరేంద్ర, గౌతమి, ప్రవీణ్ ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించనున్నారు.

News November 26, 2025

తుదిదశకు రోడ్ల వెడల్పు శిథిలాల తొలగింపు

image

వేములవాడ పట్టణంలో రోడ్ల వెడల్పుకు సంబంధించిన శిథిలాల తొలగింపు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. రూ.42 కోట్ల అంచనా వ్యయంతో పట్టణంలోని మెయిన్ రోడ్డును 80 అడుగుల మేరకు విస్తరిస్తున్నారు. ఇందుకోసం రోడ్డుకు ఇరువైపులా సుమారు 180 ఇండ్లను తొలగించారు. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన కూల్చివేతలు తిరిగి ప్రారంభం కాగా వాటికి సంబంధించిన శిథిలాలను జేసీబీ సహాయంతో తొలగిస్తున్నారు.

News November 26, 2025

వరంగల్: కోతుల పంచాయితీ తీరిస్తేనే.. గ్రామ పంచాయతీకి!

image

ఉమ్మడి వరంగల్‌లో కోతుల బెడద తీవ్రమవడంతో గ్రామ పంచాయితీ ఎన్నికలకే కొత్త పేరొచ్చింది. కోతుల పంచాయితీ తీరిస్తేనే గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా పడటం, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలే ముందుకు రావడంతో, కోతుల సమస్యను ఎవరు పరిష్కరిస్తారో వారికే ఓటు వేయాలని ప్రజలు భావిస్తున్నారు. పంటలు నాశనం, ఇళ్లలోకి చొరబాటు, కోతుల దాడులతో గ్రామాలు ఇబ్బందులు పడుతున్నాయి.