News October 31, 2024
విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు

RCB తమ రిటెన్షన్ ప్లేయర్ల జాబితాను వెల్లడించింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు చెల్లించింది. రజత్ పాటిదార్‌కు రూ.11 కోట్లు, యశ్ దయాల్‌ను రూ.5 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకున్నట్లు బీసీసీఐకి తెలియజేసింది.
Similar News
News February 17, 2026
పాకిస్థాన్ సూపర్-8కు వెళ్లాలంటే?

T20WC-2026: సూపర్-8 చేరేందుకు పాకిస్థాన్ రేపు కీలక మ్యాచ్ ఆడనుంది. నమీబియాపై గెలిస్తే 6 పాయింట్లతో నేరుగా సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ వర్షంతో రద్దయినా 5 పాయింట్లతో వెళ్తుంది. నమీబియాతో ఓడిపోతే మాత్రం పాకిస్థాన్ ఎలిమినేట్ అవుతుంది. అప్పుడు USA సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఇక USAతో (+0.788)పోలిస్తే పాకిస్థాన్ (-0.403) నెట్ రన్‌రేట్ తక్కువగా ఉంది.
News February 17, 2026
ధరలు పెరిగినా.. బంగారం దిగుమతులు తగ్గేదేలే!

భారత్‌లో ఈ ఏడాది జనవరిలో బంగారం దిగుమతులు ఒక్కసారిగా ఎగబాకాయి. స్విట్జర్లాండ్, UAE నుంచి భారీగా తరలిరావడంతో మొత్తం గోల్డ్ ఇంపోర్ట్స్ $12.1 బిలియన్లకు చేరాయి. దీంతో దేశ వాణిజ్య లోటు 3నెలల గరిష్ఠానికి ($34.7 బిలియన్లు) చేరింది. క్వాంటిటీ పరంగా దిగుమతులు తగ్గుతున్నా ధరలు ఆకాశాన్ని తాకడం వల్లే విలువల పరంగా ఈ పెరుగుదల కనిపిస్తోందని, ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ ఎగబాకడమూ ఓ కారణమని వాణిజ్య శాఖ వివరించింది.
News February 17, 2026
పంచాయతీలకు రూ.250 కోట్లు

TG: గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దాదాపు రూ.250 కోట్లను విడుదల చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లించడానికి ఈ నిధులను వినియోగిస్తారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగిస్తారు. ఇటీవల 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రూ.387 కోట్లను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.


