News August 30, 2025
రాష్ట్రానికి 21 వేల టన్నుల యూరియా: తుమ్మల

TG: ఇవాళో, రేపో రాష్ట్రానికి 21 వేల టన్నుల యూరియా వస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వచ్చే నెలలో రాష్ట్రానికి అదనపు కేటాయింపులు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30వేల టన్నుల యూరియా ఉందని, రోజుకు సగటున 9-11 వేల టన్నుల అమ్మకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి అదనంగా 2.38 లక్షల టన్నుల యూరియా కేటాయించాలని కోరినట్లు పేర్కొన్నారు.
Similar News
News August 30, 2025
కుటుంబసభ్యులను కోల్పోయాం.. వారిని భర్తీ చేయలేం: RCB

బెంగళూరు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి RCB యాజమాన్యం తాజాగా పరిహారం ప్రకటించింది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున అందించినట్లు ట్వీట్ చేసింది. ‘RCB కుటుంబంలోని 11 మందిని కోల్పోయాం. వారు మనలో భాగం. ఎన్ని డబ్బులిచ్చినా వారి స్థానాన్ని భర్తీ చేయలేం. కానీ మొదటి అడుగుగా రూ.25లక్షలు ఇచ్చాం’ అని ట్వీట్ చేసింది. ఘటన జరిగిన 3 నెలల తర్వాత RCB ఈమేరకు స్వయంగా స్పందించింది.
News August 30, 2025
సభలో మాగంటి మృతిపై సంతాప తీర్మానం

TG: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గోపీనాథ్ సేవలను గుర్తు చేసుకున్నారు. వివిధ పదవులతో జూబ్లీహిల్స్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. మాగంటితో తనకున్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని సభలో సీఎం పంచుకున్నారు. ఆయన అకాల మరణం నియోజకవర్గ ప్రజలకు తీరని లోటన్నారు.
News August 30, 2025
అప్పులను కాదు.. ఆస్తులను కొనండి: గోయెంకా

ప్రస్తుతం గొప్పలకు పోయి అప్పులు చేస్తోన్న యువతకు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా పలు సూచనలు చేశారు. ‘మీ ఆదాయానికి తగ్గట్టు జీవించండి. ముందు నుంచే పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. ఖర్చు చేసే ముందు పొదుపు చేయండి. అత్యవసర నిధిని ఉంచుకోండి. అధిక ఆదాయ నైపుణ్యాన్ని నేర్చుకోండి. అప్పులను కాదు ఆస్తులను కొనండి’ అని ఆయన ట్వీట్ చేశారు. share it