News November 21, 2024
21 కేసుల్లో దొంగలించిన సొత్తు రికవరీ.. 13 మంది అరెస్టు
కర్నూలు జిల్లాలోని 21 కేసుల్లో దొంగలించిన సొత్తును ఆదోని ఒకటో పట్టణ పోలీసులు రికవరీ చేసి 13 మందిని అరెస్టు చేశారని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. రూ.24 లక్షల విలువ గల బైక్‌లను ఇదివరకే రికవరీ చేశారన్నారు. ఈరోజు రూ.41 లక్షల ప్రాపర్టీ రికవరీ చేయడంలో ఆదోని సబ్ డివిజన్ పోలీసులు బాగా పని చేశారన్నారు. ఆదోని డీఎస్పీ సోమన్న, సీఐ శ్రీరామ్, సిబ్బందిని అభినందించారు.
Similar News
News November 27, 2024
పత్తికొండలో వ్యభిచార గృహంపై దాడులు
పత్తికొండలోని గుత్తి రోడ్డులో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై సీఐ జయన్న ఆధ్వర్యంలో ఎస్ఐ గోపాల్, పోలీసు సిబ్బంది మంగళవారం దాడులు నిర్వహించారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలితో పాటు ఐదుగురు విటులను అదుపులోకి తీసుకుని, ఒక యువతిని ఐసీడీఎస్‌కు అప్పగించినట్లు సీఐ జయన్న తెలిపారు. విటులు, వ్యభిచార గృహం నిర్వాహకురాలిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
News November 27, 2024
డోన్ రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫారం సమీపంలో మృతదేహం
డోన్ రైల్వే స్టేషన్ 4f ఫ్లాట్‌ఫారం సమీపంలో యువకుని(23) మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ప్యాపిలి మండలం రాచర్లకు చెందిన యువకుడిగా పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం జీఆర్‌పీ ఎస్ఐ 9030481295ను సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 27, 2024
ఎస్పీ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
భారత రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో భారత రాజ్యాంగ రూపకర్త డా.బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. మన దేశానికి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం కావాలని అంబేడ్కర్ లాంటి మహానుభావులు కృషి చేసి రాజ్యాంగాన్ని తీసుకువచ్చారన్నారు.