News August 5, 2025
2,119 ఉద్యోగాలు.. ఎల్లుండే లాస్ట్

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ 2,119 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. వార్డర్, టెక్నీషియన్, అసిస్టెంట్, పీజీటీ, ఫార్మసిస్ట్ వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా విభాగాల్లో డిగ్రీ/పీజీ చదివినవారు అర్హులు. వయసు 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. వివిధ పోస్టులను అనుసరించి వేతనం రూ.19,900 నుంచి రూ.1,51,000 వరకు ఉంటుంది. ఈ నెల 7లోగా dsssbonline.nic.inలో దరఖాస్తు చేసుకోవాలి.
Similar News
News August 5, 2025
మరికాసేపట్లో హైదరాబాద్‌లో వర్షం

TG: మరికాసేపట్లో HYDలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని GHMC తెలిపింది. రాబోయే 2 గంటల్లో కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, గాజులరామారం, అల్వాల్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో వర్షం పడుతుందని అంచనా వేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 20mm వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అటు మెదక్, వికారాబాద్, RR, సంగారెడ్డి, కామారెడ్డి, NZB జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ మ్యాన్ తెలిపారు.
News August 5, 2025
చర్చలకు పిలవకుండా ఇష్యూ చేస్తున్నారు: ఫిల్మ్ ఫెడరేషన్

తాము కష్టపడుతున్నందుకే వేతనాలు పెంచమని అడుగుతున్నామని టాలీవుడ్ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ తెలిపారు. ఏటా 30% వేతనాలు పెంచుతామని గతంలో హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు. చర్చలకు పిలవకుండా ఇష్యూ చేస్తున్నారన్నారు. తాము సమ్మెకు వెళ్లట్లేదని, వేతనాలు 30% పెంచి ఇస్తామన్న వాళ్లతో షూటింగ్‌లు జరుగుతున్నాయని చెప్పారు. చిన్న నిర్మాతలకు నష్టం లేకుండా చూస్తామన్నారు.
News August 5, 2025
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకుంటాం: మాధవ్

AP: కార్మికులతో కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుంటామని బీజేపీ స్టేట్ చీఫ్ పీవీఎన్ మాధవ్ అన్నారు. విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. గుంటూరు చాయ్ పే చర్చలో ఆయన మాట్లాడారు. ‘కేంద్రం ప్యాకేజీ ఇచ్చి మరీ స్టీల్ ప్లాంట్‌ను కాపాడింది. ఉత్పత్తి పెంచి లాభాల బాట పట్టిస్తాం. ఎన్డీయే పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.