News February 11, 2025
పదో తరగతి అర్హతతో 21,413 ఉద్యోగాలు

ఇండియన్ పోస్ట్ 21,413 GDS పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో 1215, తెలంగాణలో 519 ఖాళీలున్నాయి. అర్హత 10వ తరగతి కాగా కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. సైకిల్ లేదా స్కూటర్ నడిపే నైపుణ్యం ఉండాలి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. మెరిట్ ఆధారంగా రిక్రూట్మెంట్ చేపడతారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, EWS వారికి రూ.100 కాగా మిగతా అభ్యర్థులకు ఉచితం. మార్చి 3 వరకు <
Similar News
News September 15, 2025
రూ.5కే కిలో టమాటా

AP: ఓవైపు తగ్గిన ఉల్లి ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తుంటే టమాటా ధరలూ అదే బాటలో పయనిస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మార్కెట్లో ఇవాళ టమాటా ధరలు కేజీ రూ.5కు పడిపోయాయి. దిగుబడి పెరగడంతో ధరలు పతనమవుతున్నాయి. దీంతో గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. మీ ఏరియాలో టమాటా ధర ఎంత ఉందో కామెంట్ చేయండి?
News September 15, 2025
AI కంటెంట్పై కేంద్రం కీలక నిర్ణయం?

ఏఐ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇకపై ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఫొటోలు, ఆర్టికల్స్ అన్నింటికీ కచ్చితంగా లేబుల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా రిపోర్టును లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. ఏఐ కంటెంట్ సాధారణ పౌరులతోపాటు వీఐపీలను కూడా అయోమయానికి గురి చేస్తోందని పేర్కొంది.
News September 15, 2025
రాయలసీమ కోనసీమ అవుతోంది: సీఎం

AP: రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ లాంటి విధానాలతో మంచి ఫలితాలు సాధించామని, ఇప్పుడది కోనసీమగా మారుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. పట్టిసీమతో డెల్టాలో వాడే కృష్ణానీటిని పొదుపు చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగామని తెలిపారు. హంద్రీనీవా కాలువతో కుప్పం వరకూ కృష్ణా నీళ్లు తీసుకెళ్లామన్నారు. వాణిజ్య పంటల విషయంలోనూ సరైన సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభం వచ్చేలా చేయాలని కలెక్టర్లకు సూచించారు.