News December 17, 2024

22ఏ భూములకు శాశ్వత పరిష్కారం- రెవెన్యూ మంత్రి

image

విశాఖ: 22ఏ నిషేధిత జాబితా భూములకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విశాఖలో అన్నారు. డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత 22ఏ నుండి భూముల తొలగింపుపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. మార్కెట్ రేట్ ఎక్కువగా ఉన్నచోట మాత్రమే రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతామని, గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్లకు ఛార్జీలు తగ్గించే ఆలోచన చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ భూ కబ్జాలపై విచారణ చేస్తున్నామన్నారు.

Similar News

News November 15, 2025

వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఎండీతో మంత్రి లోకేశ్ భేటీ

image

మంత్రి నారా లోకేశ్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఎండి జెరేమి జుర్గెన్స్‌తో భేటీలో గ్రీన్ ఎనర్జీ, సైబర్‌సెక్యూరిటీ రంగాల్లో సహకారం కోరారు. ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చేందుకు 115 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యాన్ని వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్ జాతీయ లక్ష్యంలో 30% ఏపీలోనే సాధించాలని తెలిపారు.

News November 15, 2025

ఇఫ్కో ఛైర్మన్‌తో సీఎం చర్చలు

image

విశాఖలో జరుగుతున్న సమ్మిట్‌లో ఇఫ్కో ఛైర్మన్ దిలీప్ ననూభాయ్ సంఘానీతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. గ్రీన్ అమ్మోనియా, హైడ్రోజన్ ఆధారిత ఫెర్టిలైజర్ ప్లాంట్ల ఏర్పాటు, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. బయో-ఫర్టిలైజర్, బయో-స్టిమ్యులెంట్ యూనిట్ల స్థాపనకు ఉన్న అవకాశాల పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.

News November 15, 2025

మార్గశిర ఉత్సవాలకు దేవదాయ శాఖ మంత్రికి ఆహ్వానం

image

బురుజుపేటలో కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలకు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఆలయ ఈవో శోభారాణి ఆహ్వానించారు. విజయవాడలో శనివారం ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. లక్షలాదిగా వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని వసతి, రక్షణ, పారిశుద్ధ్యం, క్యూలైన్లు, పార్కింగ్, దర్శనం ఏర్పాట్లు, తాగునీరు, వైద్య సౌకర్యాలు, తదితర అంశాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రికి ఈవో వివరించారు.