News February 19, 2025
22న అనంతపురానికి మందకృష్ణ మాదిగ రాక

అనంతపురంలో ఈ నెల 22న ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ఎంఈఎఫ్ అనుబంధ సంఘాల రాష్ట్ర అత్యవసర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నేత చెరువు నాగరాజు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతారని పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నేతలు, అభిమానులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News October 24, 2025
పోలీసుల సేవలపై వ్యాసరచన పోటీలు: ఎస్పీ

పోలీసుల అమర వీరుల వారోత్సవాలు జరుగుతున్నట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. అనంతపురం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసుల విధులు, సేవలు, త్యాగాల గురించి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. సమాజంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. పోలీసుల సేవలపై వ్యాసరచన పోటీలు నిర్వహించామని ఎస్పీ తెలిపారు.
News October 23, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు విద్యార్థి ఎంపిక

ఇటీవల అనంతపురంలో జరిగిన జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలలో యాడికికి చెందిన విద్యార్థి తృషిత అత్యంత ప్రతిభ కనబరిచింది. దీంతో గుంతకల్ డివిజన్ జట్టుకు ఎంపికయింది. డివిజనల్ స్థాయి పోటీలలోనూ అత్యంత ప్రతిభ కనబరిచడంతో నిర్వాహకులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో తృషిత పాల్గొంటుంది.
News October 22, 2025
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: DMHO

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని DMHO దేవి వైద్యులకు సూచించారు. అనంతపురం జిల్లాలోని పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని వైద్యులు, సిబ్బందితో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా వచ్చిన అర్జీలకు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. వైద్య సేవలపై ప్రజల్లో మంచి దృక్పథం వచ్చేలా ఆసుపత్రికి వచ్చిన రోగులకు సేవలను అందించాలన్నారు.