News February 19, 2025

22న అనంతపురానికి మందకృష్ణ మాదిగ రాక

image

అనంతపురంలో ఈ నెల 22న ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ఎంఈఎఫ్ అనుబంధ సంఘాల రాష్ట్ర అత్యవసర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నేత చెరువు నాగరాజు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతారని పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నేతలు, అభిమానులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News July 7, 2025

రాయదుర్గంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

image

రాయదుర్గంలోని గ్యాస్ గోడౌన్ ఏరియాలో నివాసముంటున్న చాంద్‌బాషా ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. బాషా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ జీవితంపై విరక్తి చెంది రైలు పట్టాల మీద కూర్చున్నాడు. ఈ క్రమంలో రైలు ఢీ కొట్టింది. గమనించిన లోకోపైలట్ సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు.

News July 7, 2025

అనంతలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో గాయపడి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిప్పే స్వామి (52) సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బెళుగుప్ప మండలం ఎర్రగుడికి చెందిన తిప్పేస్వామి ఆదివారం కణేకల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కుటుంబ సభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 7, 2025

పామిడిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

పామిడిలోని జగన్నాథ పద్మావతి కన్వెన్షన్ హాల్‌లో సోమవారం కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.