News August 20, 2024
22న ఉమ్మడి జిల్లా యోగా క్రీడాకారుల ఎంపికలు

రాష్ట్రస్థాయి యోగా టోర్నీలో పాల్గొనే ఉమ్మడి జిల్లా యోగా క్రీడాకారులు, క్రీడాకారిణుల ఎంపికలు ఈనెల 22న ఉదయం 9గం. స్టేడియంలో చేపడుతున్నట్లు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రామూలు, ఆర్.బాలరాజు తెలిపారు. ఆధార్, ఇతర ధ్రువపత్రాలు తీసుకొని రావాలని, 8-10, 10-12, 12-14, 14-16, 16-18, 18-21, 21-25, 25-30, 30-35, 35-45 సంవత్సరాలలో విభాగాల్లో ఎంపికలు జరుగుతాయని, వివరాలకు 90525 54298 నంబరులో సంప్రదించాలని కోరారు.
Similar News
News February 24, 2026
రేపు పీయూలో ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’

పాలమూరు విశ్వవిద్యాలయ పీజీ కళాశాలలో బుధవారం ఉదయం 10:30 గంటలకు ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. పీయూ పరిధిలోని డిగ్రీ, ఇంటర్ ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. స్థానిక భాషతో పాటు ఇంగ్లీష్, హిందీలో ప్రావీణ్యం కనబరిచిన వారు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతారని ఆయన వెల్లడించారు.
News February 24, 2026
జడ్చర్ల: గొల్లపల్లి చెరువులో మరో యువకుడి మృతదేహం లభ్యం!

జడ్చర్ల మండలం గొల్లపల్లి చెరువులో గల్లంతైన రెండో యువకుడు యాదగిరి మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు మంగళవారం వెలికితీశాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్ భద్రతను పర్యవేక్షించగా, ఎస్సై జయప్రసాద్ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. దీంతో ఇద్దరు యువకుల గాలింపు ముగిసింది.
News February 24, 2026
MBNR: పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు!

తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు 13 పతకాలు సాధించి సత్తా చాటారు. ఇందులో 2 స్వర్ణ, 3 రజత, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. విజేతలను జిల్లా ఎస్పీ డి.జానకి అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లాకు కీర్తి తెచ్చిన క్రీడాకారుల ప్రతిభను ఆమె ప్రత్యేకంగా కొనియాడారు.


