News February 20, 2025

22న గద్వాలలో జాబ్ మేళా

image

గద్వాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ కంపెనీలలో శిక్షణ, ఉపాధి కల్పించుటకు 22వ తేదీన ఉదయం 11 గంటలకు బీసీ స్టడీ సర్కిల్ నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి డాక్టర్ యం.ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలో పాల్గొనే నిరుద్యోగులు 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉండి విద్యార్హత ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ ఎలక్ట్రీషియన్ డిప్లొమా, ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలన్నారు.

Similar News

News November 22, 2025

వారం రోజులు కన్నాల రైల్వే గేటు మూసివేత

image

పాలకుర్తి మండలం కన్నాల రైల్వే గేటును వారం రోజులు మూసివేస్తున్నట్టు శనివారం రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 23వ తేదీ ఆదివారం నుంచి 29 వరకు కన్నాల లెవెల్ క్రాసింగ్ 46 వద్ద 3వ రైల్వే ట్రాక్ బేస్ తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నందున గేట్ క్లోజ్ చేస్తున్నట్టు అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. కావున ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ దారిని ఎంచుకుని రైల్వే శాఖకు సహకరించాలని కోరారు.

News November 22, 2025

రేపు రాష్ట్ర పండుగగా పుట్టపర్తి సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాలు

image

రాష్ట్ర పండుగగా పుట్టపర్తి సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ శనివారం తెలిపారు. ఆదివారం సత్యసాయిబాబా జన్మదిన వేడుకను అధికారికంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, కలెక్టరేట్ వద్ద సత్య సాయిబాబా జన్మదిన వేడుకలు నిర్వహించాలన్నారు.

News November 22, 2025

‘స్వయం సహాయక గ్రూపుల్లో కిశోర బాలికలకు అవకాశం’

image

స్వయం సహాయక గ్రూపుల్లో 15- 18 ఏళ్ల వయసున్న కిశోర బాలికలకు అవకాశం కల్పిస్తామని, 60 ఏళ్లు దాటిన మహిళలకూ సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తామని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. బోయినిపల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో కొత్తగా 5,560 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో చేరారని వివరించారు.