News May 18, 2024
22న నెల్లూరుకు గవర్నర్ రాక

వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవం ఈ నెల 22న జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ నజీర్ అహ్మద్ హాజరుకానున్నారు. 22న ఉదయం 10.40 గంటలకు హెలికాఫ్టర్లో నెల్లూరులోని పోలీస్ గ్రౌండ్స్కు చేరుకుంటారు. 11.30 గంటల నుంచి 12.50 గంటల వరకు స్నాతకోత్సవంలో పాల్గొని సాయంత్రం తిరుగు ప్రయాణం అవుతారని వర్సిటీ వర్గాలు తెలిపాయి.
Similar News
News September 13, 2025
కాసేపట్లో కొత్త కలెక్టర్ బాధ్యతలు.. సమస్యలు ఇవే.!

నెల్లూరు కొత్త కలెక్టర్గా హిమాన్షు శుక్లా శనివారం సా.5.30 గం.కు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనకు పలు కీలక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. GGHలో అధ్వాన పరిస్థితులు, కరేడు భూముల వివాదం, సీజనల్ వ్యాధుల కట్టడి, ఆస్పత్రుల సేవల మెరుగు, పెన్నా పొర్లుకట్టలు, చెరువుల పటిష్టత, ఇసుక అక్రమ రవాణా, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రెవెన్యూ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. వాటిపై ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
News September 13, 2025
నెల్లూరు SP కృష్ణకాంత్ బదిలీ

నెల్లూరు SP కృష్ణకాంత్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అజిత వేజెండ్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల SPలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
News September 13, 2025
నెల్లూరు: ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి మైథిలి కళ్లు దానం

స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురైన మైథిలి ప్రియా కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి కుటుంబ సభ్యులు దానం చేయనున్నారు. ప్రస్తుతం మైథిలి మృతదేహం నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంది. గత రాత్రి మైథిలిని ఆమె స్నేహితుడు నిఖిల్ దారుణంగా హత్య చేశాడు. మృతురాలు బి ఫార్మసీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది.