News November 19, 2024

22న మహబూబ్‌నగర్‌కు బీసీ కమిషన్ సభ్యులు రాక

image

తెలంగాణలో స్థానిక సంస్థలలో కల్పించిన రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల నుంచి అభ్యర్థనను స్వీకరించేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు ఈనెల 22న మహబూబ్‌నగర్ ఐడీఓసీ కార్యాలయానికి రానున్నారని వనపర్తి జిల్లా బీసీ అభివృద్ధి సంక్షేమ శాఖ అధికారి బీరం సుబ్బారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన బీసీ సంఘాల సభ్యులు అభ్యర్థనలు, సలహాలు, ఆక్షేపణలు ఇవ్వవచ్చని పేర్కొన్నారు.

Similar News

News September 18, 2025

మహబూబ్ నగర్ జిల్లా వర్షపాతం వివరాలు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గడచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో వర్షం కురిసింది. అత్యధికంగా బాలానగర్ మండలంలోని ఉడిత్యాలలో 7.0 వర్షపాతం రికార్డు అయింది. అడ్డాకుల 3.5 మిల్లీమీటర్లు, నవాబుపేట మండలం కొల్లూరు 2.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసి మరికొన్ని ప్రాంతాలలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

News September 18, 2025

WOW వన్డే లీగ్.. బౌలింగ్‌లో సత్తా చాటిన గద్వాల కుర్రాడు

image

HYDలోని KCR-2 మైదానంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన్డే క్రికెట్ లీగ్ టోర్నీలో గద్వాల్ జట్టు కుర్రాడు వెంకట్ సాగర్ బౌలింగ్ లో సత్తా చాటాడు. మొదట బ్యాటింగ్ చేసిన గద్వాల్ జట్టు 44.4 ఓవర్లలో 332/10 పరుగులు చేయగా.. HYD జట్టు కేవలం 20.3 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌట్ అయింది. 9 వికెట్లు తీసిన గద్వాల్ జట్టు క్రీడాకారుడు వెంకట్ సాగర్‌కు కోచ్ శ్రీనివాస్ తదితరులు అభినందించారు.

News September 18, 2025

MBNR: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ జానకి

image

అధికారుల పేరుతో నగదు కోరే మెసేజీల పట్ల ప్రజలు మోసపోవద్దని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి అన్నారు. ఇటీవల జిల్లాలో పలువురు సైబర్ నేరగాళ్ల పన్నాగాలకు గురవుతున్నారని, అధికారులు వ్యక్తిగత ఖాతాలకు డబ్బు పంపమని అడగరని ఆమె తెలిపారు. ఇటువంటి మెసేజీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు.