News September 13, 2024
22న ముత్తూకూరులో భారీ బహిరంగ సభ

అదానీ కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ సాధన కోసం సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ పోరాటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ముత్తుకూరు సెంటర్‌లో ఈనెల 22వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు CITU ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ చేపట్టనున్నారు. అలాగే ఈనెల 16న నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
Similar News
News December 1, 2025
నెల్లూరు: కుమారుడిని చంపిన తండ్రి

ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడులో సోమవారం జరిగింది. స్థానిక దళితవాడకు చెందిన మామిడూరు పుల్లయ్యకు ఇవాళ ఉదయం పింఛన్ డబ్బులు వచ్చాయి. ఆ నగదు తనకు ఇవ్వాలని కుమారుడు మస్తానయ్య(33) తన తండ్రితో గొడవకు దిగాడు. ఈక్రమంలో తన చేతిలోని కర్రతో పుల్లయ్య కుమారుడిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మస్తానయ్య అక్కడికక్కడే చనిపోయాడు.
News December 1, 2025
నెల్లూరు నిమ్మకు తగ్గిన డిమాండ్

నిమ్మకు డిమాండ్ తగ్గిపోయింది. పొదలకూరు నుంచి ఉత్తరాది ప్రాంతాలకు నిమ్మ ఎగుమతి అవుతుంటుంది. అక్కడ అవసరాలు తగ్గిపోవడంతో నిమ్మకు పూర్తిగా డిమాండ్ తగ్గిపోయింది. బస్తా రూ.300 నుంచి రూ.600 పలుకుతుండటంతో రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోకు పది రూపాయలు కూడా లభించడం లేదు. పొదలకూరు మండల వ్యాప్తంగా 5వేల ఎకరాలలో నిమ్మ సాగు అవుతుండగా.. దీని మీద సుమారు 2వేల మంది రైతులు ఆధారపడి ఉన్నారు.
News December 1, 2025
వేమిరెడ్డి గారూ.. వీటి గురించి మాట్లాడండి!

నెల్లూరు జిల్లాలో నాట్లు మొదలయ్యాయి. 6లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనున్నారు. ప్రభుత్వం ఎకరాకు 3బస్తాల యూరియానే ఇస్తానంటోంది. ఇటీవల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. రోడ్లు విస్తరించాల్సిన అవసరం ఉంది. రైల్వే లైన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించాల్సి ఉంది. గంజాయి నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. నేటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో వీటిపై MP వేమిరెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఉంది.


