News September 13, 2024

22న ముత్తూకూరులో భారీ బహిరంగ సభ

image

అదానీ కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ సాధన కోసం సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ పోరాటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ముత్తుకూరు సెంటర్‌లో ఈనెల 22వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు CITU ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ చేపట్టనున్నారు. అలాగే ఈనెల 16న నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

Similar News

News October 4, 2024

సరఫరాకు ఇసుక సిద్ధంగా ఉంది: కలెక్టర్

image

నెల్లూరు కలెక్టర్ చాంబర్లో గురువారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా ఇసుక సిద్ధంగా ఉందని, ఆన్లైన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇసుకను సకాలంలో అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. బుకింగ్స్ పెరిగే కొద్దీ ఇసుక నిల్వలు పెంచేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News October 3, 2024

నెల్లూరు: కారు బోల్తా.. ఒకరు మృతి

image

కారు బోల్తాపడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడిన సంఘటన వింజమూరు మండలం బొమ్మరాజుచెరువువద్ద గురువారం చోటుచేసుకుంది. కావలి నుంచి కడపకు వెళ్తున్న కారు బొమ్మరాజుచెరువు వద్ద కంకరగుట్ట ఎక్కి అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో కడపకు చెందిన ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో కారు నుజ్జునజ్జయింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 3, 2024

చండీ అలంకారంలో శ్రీరాజరాజేశ్వరి

image

నెల్లూరులోని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో మొదటి రోజైన గురువారం అమ్మవారు శ్రీచండీ అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.