News April 15, 2024
22న జరిగే నామినేషన్‌ను విజయవంతం చేయండి: నంబూరు

పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నెల 22న పెదకూరపాడులో నామినేషన్ వేయనున్నట్లు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు తెలిపారు. అచ్చంపేటలో పర్యటించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆ మండలానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. సీఎం జగన్ ఐదేళ్లలో చేసిన సుపరిపాలన మరో ఐదేళ్లు కొనసాగించాలంటే కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఓటు ద్వారా తమ మద్దతు తెలపాలని కోరారు.
Similar News
News April 19, 2025
గుంటూరు: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో భాష్యం విద్యార్థుల జోరు

జేఈఈ మెయిన్ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. ఏపీ నుంచి జి.సాయిమనోజ్ఞ 100 పర్సంటైల్ సాధించి ఫిమేల్ కేటగిరీలో దేశస్థాయిలో టాపర్‌గా నిలిచింది. ఓపెన్ కేటగిరీలో 18వ ర్యాంకుతో మెరిసింది. మొత్తం 100లోపు 16 మంది, 200లోపు 28, 500లోపు 60, 1000లోపు 82 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని శనివారం గుంటూరులో భాష్యం ఛైర్మన్ రామకృష్ణ తెలిపారు. 73.24% సక్సెస్ రేటు సాధించామన్నారు.
News April 19, 2025
జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

గుంటూరులో ఒక వ్యక్తి ఇంటి కల విషాదంగా మారింది. పోలీసుల కథనం మేరకు.. ఫారూఖ్ ప్రగతినగర్‌లో తన ప్లాట్‌లో ఇంటి నిర్మాణానికి రాము అనే వ్యక్తికి రూ. 1 లక్ష ఇచ్చాడు. పనులు నెమ్మదిగా సాగడం, అడిగినా స్పందన లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఫారూఖ్, ఈ నెల 16న పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 19, 2025
GNT: మానవత్వం చాటుకున్న లాలాపేట పోలీసులు

గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని లాలాపేట స్టేషన్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సంగడిగుంటలో ఏఎస్సై నరసింహారావు, కానిస్టేబుల్ నాగరాజు గస్తీ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి వచ్చి తన భార్య కాన్పు నొప్పులతో బాధపడుతుందని, వాహన సదుపాయం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో గస్తీ పోలీసులు గర్భిణిని తమ వాహనంలో జీజీహెచ్ కాన్పుల వార్డుకు తరలించారు.