News August 19, 2025
22న నస్పూర్‌లో జాబ్ మేళా

నస్పూర్ సీసీసీ కార్నర్‌లోని నర్సయ్య భవన్‌లో ఈ నెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సమర్ధనం దివ్యాంగుల సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. డేటా ఎంట్రీ, బీపీఓ, హాస్పిటాలిటీ, రిటైల్, హెల్త్ కేర్, ఆటోమోటివ్ రంగాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 18- 30 ఏళ్ల వారు ఎస్ఎస్సీ, డిగ్రీ, డిప్లొమా, ఒకేషనల్ కోర్సు చదివిన వారు మేళాకు హాజరు కావాలని కోరారు.
Similar News
News April 14, 2026
TODAY HEADLINES

⋆ 2029లోగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు: మోదీ
⋆ డీలిమిటేషన్‌పై ఏకాభిప్రాయం అవసరం: రేవంత్
⋆ ఈ నెల 22 నుంచి TGSRTC సమ్మె
⋆ TG TET, DOST నోటిఫికేషన్ విడుదల
⋆ ఎండలు.. రేపు 12PM-4PM మధ్య బయటకు వెళ్లకండి: APSDMA
⋆ AP: మే 1 నుంచి ఆన్‌లైన్‌లోనే పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ
⋆ IPL: RRపై SRH విజయం
News April 14, 2026
చిరునామా వెతికి మరీ.. బాధితురాలికి బ్యాగ్ అందజేత

కాకినాడకు చెందిన రోకళ్ల లలితాంబిక సోమవారం ఆటోలో ప్రయాణిస్తూ టౌన్ హాల్ వద్ద బ్యాగ్ పోగొట్టుకున్నారు. విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ RSI బి వి సత్యనారాయణ, సిబ్బంది ఆ బ్యాగ్ గమనించి చిరునామా ఆధారంగా ఆమెకు అందజేశారు. బ్యాగులో నగదు, సెల్‌ఫోన్ ఉన్నట్లు బాధితురాలు తెలిపారు. సిబ్బంది నిజాయితీని జిల్లా SP బిందుమాధవ్ అభినందించారు. స్థానికులు పోలీసుల సమయస్ఫూర్తిని ప్రశంసిస్తున్నారు.
News April 14, 2026
రాజస్థాన్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్

IPLలో భాగంగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో SRH 57 రన్స్ తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. భీకర టాపార్డర్ కాస్తా తొలి ఓవర్‌లోనే కుప్పకూలగా.. ఫెరీరా (69), జడేజా (45) వందకు పైగా భాగస్వామ్యం నమోదు చేశారు. చివరికి 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. వైభవ్, జురెల్, ప్రిటోరియస్ డకౌట్ కాగా, జైస్వాల్(1), పరాగ్(4) విఫలమయ్యారు. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ చెరో 4 వికెట్లు తీశారు.


