News July 21, 2024
22 వరకు అంగన్వాడీలకు సెలవు: జిల్లా పీడీ

భారీ వర్షాలు, వరదల కారణంగా ఏలూరు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు ఈనెల 22 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్టు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏలూరు జిల్లా పీడీ పద్మావతి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతలకు అవసరమైన అత్యవసర సేవలు అందించేందుకు అంగన్వాడీ కార్యకర్తలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవులు ఇస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News December 22, 2025
ప.గో జిల్లాలో యూరియా కొరత లేదు: జేసీ

జిల్లాలో యూరియా కొరత లేదని రబీ సీజన్కు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి భీమవరంలో తెలిపారు. జిల్లాలో రబీ పంటకు, అన్ని పంటలకు అవసరమైన 36,820 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువుల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది అన్నారు. అక్టోబర్ 1 నాటికి 7,009 మెట్రిక్ టన్నుల యూరియా ప్రారంభ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
News December 22, 2025
అండర్-19 నేషనల్ క్రికెట్ పోటీలకు భీమవరం విద్యార్థి ఎంపిక

ఢిల్లీలో ఈ నెల 24 నుంచి 27 వరకు జరగనున్న అండర్-19 నేషనల్ క్రికెట్ టోర్నమెంట్కు భీమవరం విద్యార్థి ఒల్లిపల్లి దుర్గా రాంచరణ్ ఎంపికయ్యాడు. 9వ తరగతి చదువుతున్న రాంచరణ్ ఇప్పటి వరకు 72 మ్యాచ్లు ఆడి 46 వికెట్లు తీశాడు. బ్యాటింగ్లో 139 పరుగుల అత్యధిక స్కోరు సాధించాడు. రాంచరణ్ మరిన్ని విజయాలు సాధించాలని స్థానికులు కోరుతున్నారు.
News December 22, 2025
తణుకు: బియ్యపు గింజపై బంగారంతో వైఎస్ జగన్ పేరు

మాజీ CM వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా తణుకుకు చెందిన సూక్ష్మ కళాకారుడు భవిరి నాగేంద్రకుమార్ తన ప్రతిభ చాటుకున్నారు. 0.030 పాయింట్ల బంగారంతో బియ్యపు గింజపై జగన్ పేరును తీర్చిదిద్దారు. సుమారు మూడు గంటల సమయం వెచ్చించి దీనిని సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. నాగేంద్ర కుమార్ నైపుణ్యాన్ని స్థానికులు, వైసీపీ నేతలు మెచ్చుకున్నారు.


