News December 13, 2025

22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

image

TG స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీజీ సెట్) పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో ఎగ్జామ్స్ జరగనున్నాయి. టీజీ సెట్‌ను 45వేల మంది అభ్యర్థులు రాయనుండగా 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 18 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ అర్హత కోసం నిర్వహించే ఈ పరీక్షలు 2 షిఫ్టుల్లో జరగనున్నాయి.

Similar News

News December 14, 2025

‘లంపి స్కిన్’తో పాడి పశువులకు ప్రాణ హాని

image

పాడి పశువులకు సోకే ప్రమాదకర వ్యాధుల్లో లంపి స్కిన్(ముద్ద చర్మం) ఒకటి. ఇది వైరస్ వల్ల వచ్చే అంటు వ్యాధి. గతంలో ఈ వ్యాధి సోకి అనేక రాష్ట్రాల్లో పశువులు మృతి చెందాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పశువులకు ఇది సోకుతుంది. దీని వల్ల అవి బలహీనంగా మారి పాల దిగుబడి బాగా తగ్గిపోతుంది. ఈ వ్యాధి తీవ్రమైతే పశువుల ప్రాణాలు పోతాయి. ఈ వ్యాధి లక్షణాలు, నివారణ మందు తయారీ సూచనలకు <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 14, 2025

ఇతిహాసాలు క్విజ్ – 96

image

ఈరోజు ప్రశ్న: సూర్యుడి వేడిని తాళలేక తన లాంటి రూపమున్న స్త్రీని సృష్టించి, సూర్యుని వద్ద ఉంచి, అశ్వ రూపంలో అడవులకు వెళ్లిపోయింది ఎవరు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 14, 2025

పాడి పశువుల్లో లంపీ స్కిన్ లక్షణాలు

image

లంపీ స్కిన్ సోకిన పశువులు జ్వరం బారినపడతాయి. మేత సరిగా తీసుకోవు. శరీరంపై గుండ్రటి గట్టిగా ఉండే మడతలు, కండ్లు, ముక్కు నుంచి నీరు కారడం, చొంగకారడం కనిపిస్తుంది. తీవ్రత పెరిగితే శరీరంపై బొడిపెలు ఏర్పడి శరీరమంతా వ్యాపిస్తాయి. ఇవి పగిలి పశువుల శరీరంపై గాయాలు ఏర్పడి పుండ్లుగా మారిపోతాయి. దీని వల్ల పశువుల పాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. పశువుల బరువు, తోలు నాణ్యత తగ్గి కొన్నిసార్లు వాటి ప్రాణాలు పోతాయి.