News October 9, 2025
22 ఏళ్ల సినీ ప్రయాణం.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్

‘లేడీ సూపర్ స్టార్’ నయనతార సినీ పరిశ్రమలోకి వచ్చి 22 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘మొదటి సారి కెమెరా ముందు నిల్చొని 22 ఏళ్లయింది. సినిమాలే ప్రపంచమవుతాయని నాకు తెలియదు. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్, ప్రతి మౌనం నాకు ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా నన్ను తీర్చిదిద్దాయి’ అని పేర్కొన్నారు. ఈ బ్యూటీ 2003లో ‘మనస్సినక్కరే’ అనే మలయాళ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
Similar News
News October 9, 2025
సునామీలో మిస్సింగ్.. 14 ఏళ్లుగా వెతుకుతున్న భర్త!

ఎంతో ఇష్టమైన భార్యను కోల్పోయి 14 ఏళ్లు అవుతున్నా జపాన్‌కు చెందిన భర్త యసువో టకమాట్సు ఆమె జాడ కోసం సముద్రంలో జల్లెడ పడుతున్నారు. 2011 సునామీలో కొట్టుకుపోయే ముందు భార్య యుకో ‘నాకు ఇంటికి వెళ్లాలని ఉంది’ అని చెప్పారు. ఆ మాట యసువోను 14 ఏళ్లుగా వెంటాడుతోంది. ఆమె మాటలను గౌరవించి స్కూబా డైవింగ్ నేర్చుకొని ఓనగావా సముద్రంలో వెతుకుతున్నారు. తిరిగి రాదని తెలిసినా వెతికే ప్రయత్నాన్ని ఆపట్లేదు.
News October 9, 2025
791 పోస్టుల స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదల

AP: అటవీశాఖలో ఫారెస్టు బీట్ ఆఫీసర్, అసిస్టెంటు బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టు ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. సెప్టెంబర్ 7న ఈ పరీక్షలు నిర్వహించారు. మెయిన్స్‌కు FSOకు 2,346, FBO, ABOలకు 13,845 మంది అర్హత సాధించినట్లు కమిషన్ పేర్కొంది. FSOలో 100, FBO, ABOల్లో 691 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఫలితాల కోసం ఇక్కడ <
News October 9, 2025
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

AP: 31 మంది IASలను ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుత స్థానాల నుంచి వేర్వేరు డిపార్టుమెంట్లకు వీరిని మారుస్తూ CS విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
APSPDCL సీఎండీగా శివశంకర్ తోలేటి, APPSC సెక్రటరీగా రవి సుభాష్, వ్యవసాయ డైరెక్టర్‌గా మనజీర్ జిలానీ, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చక్రధర్‌బాబు, పౌరసరఫరాల శాఖ వైస్ ఛైర్మన్‌గా ఎస్.ఢిల్లీరావును బదిలీ చేసింది. పూర్తి జాబితాకు ఇక్కడ <