News March 3, 2025
22,227 మంది విద్యార్థులు.. ఉ.9 నుంచి పరీక్ష

ఇంటర్ సెకండియర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మ.12 వరకు ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష జరగనుంది. కర్నూలు జిల్లాలో రెండో సంవత్సరం విద్యార్థులు 22,227 మంది ఉండగా జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30 గంటలకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
☛ All The Best Students
Similar News
News October 1, 2025
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన కర్నూలు కలెక్టర్

కర్నూలు కలెక్టర్ డాక్టర్ సిరి నగరంలోని భగత్ సింగ్ నగర్‌లో పెన్షన్లను పంపిణీ చేశారు. అలాగే సి క్యాంపు రైతు బజార్లో సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వల్ల కలిగే ప్రయోజనాలను కలెక్టర్ వ్యాపారులకు, ప్రజలకు తెలియజేశారు. కలెక్టర్ వెంట నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్, డీఆర్డీఏ సిబ్బంది పాల్గొన్నారు.
News September 30, 2025
రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి టీజీ భరత్ దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి టీజీ భరత్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం ఎంతో బాధ కలిగించిందని ఓ ప్రకటనలో తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
News September 30, 2025
దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు ప్రతిష్ఠ బందోబస్తు: ఎస్పీ

దసరా పండుగను పురస్కరించుకుని వచ్చే నెల 2న (గురువారం) దేవరగట్టు శ్రీ మాళమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవం శాంతియుతంగా, ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా జరగాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామన్నారు. బన్నీ ఉత్సవం సందర్భంగా ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 800 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు.