News November 26, 2025

22A భూములపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి: మంత్రి నాదెండ్ల

image

22A కింద నమోదైన జిరాయితీ భూముల యజమానులు భూములు అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. పొరపాటుగా నమోదైన భూములను 22A జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, దీనిని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని సీఎం ఆదేశించారన్నారు.

Similar News

News November 26, 2025

సిరిసిల్ల: ‘టీఆర్పీ అభ్యర్థులను గెలిపించండి’

image

రానున్న సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుర్ర మల్లేశం గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో టీఆర్పీ కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించి, ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో పార్టీని బలపరుస్తామని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తెలిపారు. పలువురు నాయకులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

News November 26, 2025

మంగళగిరి: ‘లోకేశ్ తన పర్యటనలకు సొంత నిధులనే వాడుతున్నారు’

image

మంత్రి లోకేశ్ విమాన ప్రయాణాలపై వచ్చిన కథనాలపై సురేష్‌బాబు అనే వ్యక్తి సమాచార హక్కు చట్టాన్ని వినియోగించారు. లోకేశ్ ఇప్పటివరకు పర్యటించిన విమాన చార్జీల‌కు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అధికారులు వెల్లడించినట్లు సురేష్‌బాబు తెలిపారు. ప‌ర్య‌ట‌న‌లకు సొంత సొమ్మునే ఆయన వెచ్చిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ పై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోమని టీడీపీ నేతలు హెచ్చరించారు.