News August 21, 2024

23న కంచరపాలెంలో జాబ్ మేళా

image

విశాఖ నగరం కంచరపాలెం జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో ఈనెల 23న నిరుద్యోగ యువతకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి సీహెచ్ సుబ్బిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కంపెనీల్లో 750 ఖాళీలను భర్తీ చేసేందుకు రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. 10, ఇంటర్, డిగ్రీ, డిప్లోమా ఎలక్ట్రికల్, ఫార్మసీ, పీజీ చేసిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు.

Similar News

News September 17, 2024

విశాఖలో ఆన్‌లైన్‌ వ్యభిచారం.. ఐదుగురు అరెస్ట్

image

విశాఖలోని ఆన్‌లైన్‌లో జరుగుతున్న వ్యభిచార గుట్టును సైబర్ క్రైమ్ టూ టౌన్ పోలీసులు రట్టు చేశారు. నగర కమిషనర్ ఆదేశాలతో నిఘా పెట్టిన పోలీసులు.. ఏజెంట్ల సాయంతో వ్యభిచారం నిర్వహిస్తున్న రావాడ కామరాజుతో పాటు రమేశ్, సుభద్ర, సూర్యవంశీ, రాములను అరెస్టు చేశారు. 34 మంది ఏజెంట్ల డేటాను భద్రపరిచి అనాధికార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.

News September 17, 2024

ఈ నెల 19న విశాఖకు గవర్నర్ రాక

image

ఈనెల 19వ తేదీన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ విశాఖ రానున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో మధ్యాహ్నం 3.50 గంటలకు ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్‌కు వెళతారు. సాయంత్రం ఏయూలో నిర్వహించే దివ్య కల మేళాలో ఆయన పాల్గొంటారు. తిరిగి నొవాటెల్ కు చేరుకొని రాత్రి అక్కడ బస చేస్తారు. 20వ తేదీ సాయంత్రం విమానంలో ఆయన విజయవాడ వెళతారు.

News September 16, 2024

విశాఖ-దుర్గ్ వందేభారత్ టైమింగ్స్ ఇవే

image

విశాఖ నుంచి దుర్గ్ వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో గురువారం మినహా ఆరు రోజులు నడపనున్నారు. 20829 నంబర్‌తో దుర్గ్‌లో ఉ.5:45కి బయలుదేరి అదే రోజు మ.1:45 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖ నుంచి 20830 నంబర్‌తో మ.1:50 నిమిషాలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11:50 నిమిషాలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈనెల 20వ నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరుగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే డీఆర్ఏం తెలిపారు.