News June 18, 2024

23న కుప్పానికి చంద్రబాబు రాక..?

image

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి చిత్తూరు జిల్లా కుప్పానికి చంద్రబాబు రానున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న ఆయన కుప్పంలో పర్యటిస్తారని టీడీపీ నేతలకు సమాచారం అందింది. రెండు రోజులు పాటు కుప్పంలోనే సీఎం ఉంటారని సమాచారం. ఈ మేరకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా చంద్రబాబు పర్యటన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

Similar News

News January 16, 2025

చిత్తూరు: రేపటి నుంచి కానిస్టేబుళ్లకు పరీక్షలు

image

స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల (సివిల్, ఎ.పి.ఎస్.పి) దేహ దారుఢ్య సామర్థ్య పరీక్షలు ఉమ్మడి చిత్తూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్ మైదానంలో 17, 18వ తేదీలలో జరగనున్నాయని ఎస్పీ మణికంఠ తెలిపారు. 8, 9 తేదీలలో జరగాల్సిన పరీక్షలు వైకుంఠ ఏకాదశి కారణంగా వాయిదా పడ్డాయన్నారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు.

News January 16, 2025

తిరుమలలో విషాదం.. బాలుడి మృతి

image

తిరుమల వసతి సముదాయం రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడ్డ ఓ బాలుడు మృతిచెందాడు. కడప టౌన్ చిన్న చౌక్‌కి చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతులు శ్రీనివాస రాజు, సాత్విక్(3) అనే ఇద్దరు కుమారులతో కలిసి తిరుమలకు వచ్చారు. సాయంత్రం అన్నతో ఆడుకుంటూ సాత్విక్ కిందపడగా.. తీవ్ర గాయాలయ్యాయి. తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News January 16, 2025

నా చుట్టూ తిరిగితే పదవులు రావు: నారా లోకేశ్

image

నారావారిపల్లెలో బుధవారం ఉత్తమ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన చుట్టూ తిరిగితే పదవులు రావని తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయని మరోసారి స్పష్టం చేశారు. నాయకుల పనితీరుపై వాట్సప్ ద్వారా ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు చెప్పారు. పొలిట్‌బ్యూరోలో ప్రతి రెండేళ్లకు ఒకసారి 30 శాతం కొత్తవారు రావాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు.