News October 22, 2024
23న జగ్గయ్యపేటలో వెయిట్, పవర్ లిఫ్టింగ్ జట్ల ఎంపికలు
జగ్గయ్యపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో అక్టోబర్ 23న జిల్లా వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ జట్ల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఎస్జీఎఫ్ కార్యదర్శులు దాసరి శ్రీనివాస్, ఎమ్ శ్రీనివాస్‌లు తెలిపారు. ఈ ఎంపికలు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14,17 బాల, బాలికలకు జరుగుతాయన్నారు. జిల్లాలో ఆసక్తి గలవారు ఉదయం 9 గంటలకు జిల్లా ఎస్జీఎఫ్ ఎంట్రీ ఫామ్‌తో హాజరుకావాలన్నారు
Similar News
News November 2, 2024
మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీకి న్యాక్(NAAC) బీ+ గ్రేడ్
కృష్ణా యూనివర్సిటీ(KRU)కి న్యాక్ బీ+ గ్రేడ్ లభించింది. ఈ మేరకు యూనివర్సిటీ వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్(NAAC) నుంచి అధికారికంగా కృష్ణా యూనివర్సిటీకి న్యాక్ (NAAC) బీ+ గ్రేడ్ అందజేస్తున్నట్లు అధికారిక మెయిల్ వచ్చిందని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. KRUకి బీ+ గ్రేడ్ లభించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.
News November 2, 2024
విజయవాడ: APCRDAలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విజయవాడలోని APCRDA కార్యాలయం నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన 19 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు నవంబర్ 13లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా GIS&రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్(6), హెల్త్&సేఫ్టీ స్పెషలిస్ట్(4) తదితర ఉద్యోగాలను APCRDA భర్తీ చేయనుంది. అభ్యర్థులు నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలకై https://crda.ap.gov.in/Careers/General చూడవచ్చు.
News November 2, 2024
కృష్ణా: రైలు ప్రయాణికులకు శుభవార్త
విజయవాడ మీదుగా ప్రయాణించే విశాఖపట్నం(VSKP)- కొల్లామ్(QLN) స్పెషల్ రైళ్లకు 2 అదనపు కోచ్‌లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.08539/08540 రైళ్లకు 1 ఏసీ 3 టైర్, ఒక స్లీపర్ కోచ్‌ను అదనంగా జత చేస్తున్నామన్నారు. నం.08539 VSKP- QLN రైలును నవంబర్ 6 నుంచి 27 వరకు, నం.08540 QLN- VSKP రైలును NOV 7 నుంచి 28 వరకు ఈ అదనపు కోచ్‌లతో నడుపుతామన్నారు.