News July 19, 2024
23న రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు వాక్- ఇన్ ఇంటర్వ్యూలు

శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్వీమ్స్) యూనివర్సిటీ నందు మెడికల్/ పారామెడికల్ విభాగంలో రీసెర్చ్ అసోసియేట్-01 పోస్ట్ కు ఈనెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు వాక్- ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఎమ్మెస్సీ నర్సింగ్/ MPT న్యూరో/ఎమ్మెస్సీ న్యూరో సైన్స్/ ఎమ్మెస్సీ న్యూరో ఫిజియాలజీ పూర్తిచేసిన వారు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://svimstpt.ap.nic.in/ వెబ్ సైట్ చూడగలరు.
Similar News
News October 19, 2025
‘కాంతార’లో మెప్పించిన SRపురం వాసి

పాన్ ఇండియా మూవీ ‘కాంతార’లో SRపురం(M) పొదలపల్లికి చెందిన ఏకాంబరం నటించారు. ఇందులో భాగంగా తన నటనకు దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి మొచ్చకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన్ను స్వగ్రామం గంగాధర నెల్లూరులో వైసీపీ నేత కృపాలక్ష్మి అభినందించారు. సినిమా రంగంలో మరింత ప్రతిభ చూపి గుర్తించ దగ్గ పాత్రలు పోషించాలని ఆమె ఆకాంక్షించారు.
News October 19, 2025
పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు ప్రారంభం

పదో తరగతి విద్యార్థులు ఈనెల 21 నుంచి పరీక్ష ఫీజులు చెల్లించేందుకు రాష్ట్ర విద్యాశాఖ అనుమతించింది. ఈ మేరకు చిత్తూరు డీఈఓ వరలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పరీక్షల విభాగం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు పరీక్ష ఫీజు చెల్లించాలి. పరీక్ష చెల్లించే సమయంలో విద్యార్థులకు తప్పనిసరిగా అపార్ ఐడీ ఉండాలి. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని హెచ్ఎంలను డీఈఓ ఆదేశించారు.
News October 19, 2025
నేడు చిత్తూరులో ముగింపు సమావేశం

జీఎస్టీ తగ్గింపు వల్ల వివిధ రకాల వస్తువుల ధరల తగ్గుదలపై నెలరోజులుగా జిల్లాలో వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించారు. నేడు జీఎస్టీ 2.0 ముగింపు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. చిత్తూరులోని మహాత్మ జ్యోతిరావు ఫూలే భవన్లో ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరుకానున్నారు.