News January 20, 2025
23న విద్యార్థులకు పోటీలు: DEO

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘nothing like voting, 1 vote for sure’ అనే అంశంపై ఈనెల 23న వ్యాసరచన, వక్తృత్వ, స్లోగన్ రైటింగ్, చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తున్నట్లు గుంటూరు డీఈవో సీవీ రేణుక సోమవారం తెలిపారు. పాత బస్టాండ్ వద్దనున్న ఉర్థూ బాలుర పాఠశాలలో ఉదయం 9.30గంటలకు పోటీలు జరుగుతాయన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 25న బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందన్నారు.
Similar News
News February 11, 2025
వైసీపీ పంచాయితీరాజ్ విభాగం డైరీ ఆవిష్కరణ

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం వైసీపీ పంచాయితీరాజ్ విభాగం డైరీ 2025ను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆవిష్కరించారు. గ్రామ స్వరాజ్యం స్ధాపనకు గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, స్ధానిక సంస్ధల బలోపేతంతో పాటు ఆర్ధికంగా వాటిని స్వయంసమృద్ధి దిశగా తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు.
News February 11, 2025
గుంటూరులో పల్నాడు మిర్చిరైతుల ధర్నా !

పల్నాడు జిల్లా గ్రంథసిరి అచ్చంపేట మండలానికి చెందిన మిర్చి రైతులు మంగళవారం గుంటూరు మిర్చియార్డు వద్ద ధర్నాకు దిగారు. యార్డులోని విజయభాస్కర ట్రేడర్స్ యజమానులు శ్రీనివాస్ రెడ్డి, కిషోర్ రెడ్డి భాగస్వాములుగా ఉండి గతేడాది తమ పంటపై వచ్చిన లాభాలతో పాటూ అదనంగా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఐదుగురు రైతుల వద్ద రూ.10లక్షల చొప్పున మొత్తం రూ.50 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
News February 11, 2025
వైసీపీ కార్యాలయానికి మరోసారి నోటీసులు

తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు, నేతల జాబితా ఇవ్వాలని పార్టీ కార్యాలయ వర్గాలను పోలీసులు కోరారు. అలాగే సీసీ కెమెరా డేటా, పార్కింగ్ లోని వాహనాల వివరాలతో మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి పీఎస్‌కు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.