News July 19, 2024
23న సాఫ్ట్ బాల్ జూనియర్స్, సీనియర్స్ జిల్లా జట్ల ఎంపిక

అనంతపురం నగర శివారులోని ఆర్డీటీ క్రీడా మైదానంలో ఈనెల 23న జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం ఆధ్వర్యంలో సాఫ్ట్ బాల్ జూనియర్స్, సీనియర్స్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూనియర్స్ విభాగంలో 1-1-2007 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. జూనియర్స్ జట్టు ఆగస్టు 17 నుంచి శ్రీకాకుళంలో, సీనియర్స్ జట్టు ఆగస్టు 10 నుంచి వినుకొండలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
Similar News
News December 24, 2025
సీఎం చంద్రబాబును కలిసిన పూల నాగరాజు

అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన పూల నాగరాజు మంగళవారం సెక్రటేరియట్‌లో సీఎం నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని నాగరాజు పేర్కొన్నారు. ఆయనతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
News December 23, 2025
నూతన పింఛన్లకు మార్గదర్శకాలు రాలేదు: జిల్లా కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా పథకం కింద నూతన పింఛన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రావాల్సి ఉందని జిల్లా కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కేవలం స్పౌజ్ కేటగిరీ కింద భర్త మరణించిన వితంతువులకు మాత్రమే పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర కేటగిరీల దరఖాస్తుదారులు మార్గదర్శకాలు వచ్చే వరకు వేచి ఉండాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు.
News December 23, 2025
ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి: కలెక్టర్

ప్రతి రోజు 50 వేల మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ హాల్ నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ఉపాధి హామీ పథకం, ఏపీఎంఐపీ, హౌసింగ్ తదితర అంశాలపై ఆయా శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. ఉపాధి హామీ పథకం కింద రోజుకు 28 వేల మంది కూలీలు పనులకు వస్తున్నారన్నారు. ఆ సంఖ్యను మరింత పెంచాలని సూచించారు.


