News July 9, 2025
23న సిద్దిపేట జిల్లాలో గవర్నర్ పర్యటన

సిద్దిపేట జిల్లా కోహెడలో ఈ నెల 23న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ హైమావతి మంగళవారం హెలిప్యాడ్ ల్యాండింగ్ స్థలాన్ని పరిశీలించారు. గవర్నర్ పర్యటనకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 282 మహిళా సంఘాలకు గవర్నర్ చేతుల మీదుగా స్టీల్ సామాగ్రి (స్టీల్ బ్యాంకు) పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News July 9, 2025
భారత నేవీలో 1,040 పోస్టులు

భారత నేవీలోని పలు విభాగాల్లో 1,040 గ్రూప్-బీ, సీ పోస్టుల భర్తీకి అప్లికేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. ఈ నెల 18 అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, PH, మహిళలు మినహా మిగతావారికి రూ.295గా ఉంది. రాతపరీక్షతో పాటు పలు పోస్టులకు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. పూర్తి వివరాల PDF కోసం ఇక్కడ <
News July 9, 2025
నిర్మల్: ‘15 తేదీలోగా దరఖాస్తు చేసుకోండి’

జిల్లాలో పదో తరగతి చదువుతున్న దివ్యాంగుల వివరాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించాలని డీఈవో రామారావు తెలిపారు. మార్చి 2026లో జరిగే పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే దివ్యాంగులకు కొన్ని మినహాయింపులు వర్తిస్తాయని తెలిపారు. దరఖాస్తు ఫారాన్ని నింపి దివ్యాంగుల సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను జతచేసి ఈనెల 15వ తేదీలోగా ప్రధానోపాధ్యాయుల ద్వారా డీఈఓ కార్యాలయంలో అందించాలని సూచించారు.
News July 9, 2025
ఏలూరు: 14న 2,500 ఉద్యోగాలకు జాబ్ మేళా

వట్లూరులోని CR రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జులై 14న ఎంపీ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జితేంద్రబాబు బుధవారం తెలిపారు. సుమారు 2,500 ఉద్యోగ ఖాళీలకు ఈ మేళా నిర్వహిస్తున్నామన్నారు. 18-35 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ, ఎంబీఏ, పీజీ, బీటెక్ విద్యార్హతలు ఉండాలన్నారు. వివరాలకు 8143549464 సంప్రదించాలి.