News January 21, 2026
23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ

TG: రికార్డు స్థాయిలో ఈ వారం 23 వేల మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.261.51 కోట్లు చెల్లించినట్లు హౌసింగ్ ఎండీ గౌతం తెలిపారు. ఈ మార్చికల్లా లక్ష ఇళ్లను పూర్తి చేయడంతో పాటు తదుపరి దశను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైనట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో రూ.4,351 కోట్లకు పైగా నిధులు విడుదల చేశామన్నారు.
Similar News
News February 16, 2026
ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి గడువును పెంచారు. ఫిబ్రవరి 15 ఆఖరు తేదీ కాగా.. ఫిబ్రవరి 22 వరకు పొడిగించారు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పాటు ICAIలో సభ్యత్వం ఉన్న అభ్యర్థులు అర్హులు. వయసు 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.eximbankindia.in
News February 16, 2026
విత్తనాలు కొనేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి

విత్తనాలను లైసెన్స్ కలిగిన అధీకృత డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. సీల్ తీసి ఉన్న విత్తన సంచులు, పగిలిన విత్తన ప్యాకెట్లు, మూతలు తీసిన డబ్బాల్లోని విత్తనాన్ని కొనుగోలు చేయకూడదు. హైబ్రిడ్ విత్తనం( మొక్కజొన్న, మిరప పంటలకు) కొనుగోలు చేసేముందు విత్తనం రకం, భౌతిక, జన్యు స్వచ్ఛతలు, మొలకెత్తే స్వభావం అన్నీ లేబుల్ మీద సరిగా ఉన్నాయా, లేదా అని ఒకటికి రెండుసార్లు గమనించి కొనుగోలు చేయాలి.
News February 16, 2026
ఇంట్లో కర్పూరం వెలిగిస్తే…

కర్పూరానికి ఇంట్లోని వాస్తు దోషాలను తొలగించే శక్తి ఉంటుందని పండితులు అంటున్నారు. రోజూ సాయంత్రం కర్పూరం వెలిగిస్తే ప్రతికూల శక్తి నశించి, సానుకూలత పెరుగుతుందని చెబుతున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కర్పూరం చంద్ర, శుక్ర గ్రహాలకు ప్రతీక. దీన్ని వెలిగిస్తే పితృదోషాలు తొలగి, ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. కర్పూర సువాసన గాలిలోని బ్యాక్టీరియాను హరించి ఆరోగ్యకర వాతావరణాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తుంది.


