News October 20, 2024
23 నుంచి క్లస్టర్ యూనివర్సిటీ సెమిస్టర్ పరీక్షలు

కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ అనుసంధానంగా ఉన్న సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల, కేవీఆర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల (ఫర్మిన్) కళాశాలలో ఈనెల 23 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు 3, 5వ సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని వీసీ టీవీఎస్ సాయి గోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్, ఐడీ కార్డు తప్పనిసరిగా తీసుకు రావాలని సూచించారు.
Similar News
News November 16, 2025
కర్నూలు: 675 మందిపై కేసులు

జనవరి-అక్టోబర్ వరకు జిల్లా వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన 675 మంది మైనర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు. మొదటిసారి పట్టుబడితే హెచ్చరికతో దండిస్తామని, రెండోసారి అయితే రూ.5 వేల జరిమానా విధిస్తున్నామని చెప్పారు. మద్యం తాగి డ్రైవింగ్ చేసిన మైనర్లతో పాటు వాహన యజమానులపైనా కేసులు నమోదవుతాయని హెచ్చరించారు.
News November 16, 2025
అంగన్వాడీల్లో పిల్లలకు పోషకాహారం అందించాలి: కలెక్టర్ సిరి

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పోషకాహార లోపం లేకుండా చూడాలని సీడీపీఓలను కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించారు. ఉదయం 9 గంటలకు కేంద్రాలు తెరచి, పిల్లల ఎత్తు, బరువు ప్రమాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. తల్లులకు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని, వాట్సాప్ గ్రూపుల ద్వారా పోషకాహారంపై వీడియోలు పంపాలని ఆమె సూచించారు.
News November 15, 2025
మైనర్ డ్రైవింగ్ తీవ్ర నేరం: కర్నూలు ఎస్పీ

మైనర్ డ్రైవింగ్ చట్ట ప్రకారం తీవ్ర నేరమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. 2025 జనవరి–అక్టోబర్ మధ్య జిల్లాలో 675 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రోడ్డు నిబంధనలు తెలియక ప్రమాదాలు జరుగుతున్నాయని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులను, యజమానులను ఆయన సూచించారు. రెండోసారి పట్టుబడితే ₹5,000 జరిమానా ఉంటుందని హెచ్చరించారు.


