News May 25, 2024

23 రౌండ్లలో మండపేట ఓట్ల లెక్కింపు.. ఫలితం ఆలస్యం!

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో ఓట్లు లెక్కింపుపై సర్వత్ర ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కడ చూసినా ఏ అభ్యర్థి గెలుస్తారు..? ఫలితాలు ఏ పార్టీ వైపు ఉంటాయి..? అనే చర్చ నడుస్తుంది. అయితే.. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట ఫలితం ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు శ్రీనివాస ఇంజినీరింగ్ కాలేజీలో జరగనుంది. మండపేట ఓట్లను 23 రౌండ్లలో లెక్కిస్తారు. దీంతో లెక్కింపునకు ఎక్కువ సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

Similar News

News February 24, 2026

రాజమండ్రి: పాల కల్తీకి కారణం ‘కూలెంట్’ లీకేజీ!

image

కలకలం రేపిన కల్తీ పాల ఘటనకు కారణాలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గణేశ్ కూలింగ్ ఛాంబర్‌లో మరమ్మతులు చేస్తుండగా, ఫ్రిడ్జ్‌లోని ‘ఇథిలీన్ గ్లైకాల్’ అనే కూలెంట్ లీకై పాలలో కలిసినట్లు నిర్ధారించినట్లు సమాచారం. వరలక్ష్మీ డెయిరీ పేరుతో అనధికారికంగా ఈ కేంద్రం నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. వారం క్రితమే ఈ లీకేజీ జరిగినట్లు సమాచారం. బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతున్నారు.

News February 23, 2026

కల్తీ పాల ఘటన.. నరసాపురంలో ఉన్నతాధికారుల పర్యటన

image

రాజమండ్రిలో నమోదైన ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఘటన నేపథ్యంలో కోరుకొండ మండలం నరసాపురం గ్రామాన్ని ఆరోగ్య శాఖ కమిషనర్ జి.వీర పాండ్యన్, కలెక్టర్ కీర్తి చేకూరి, డీఐజీ అశోక్ కుమార్ సోమవారం పర్యటించారు. తాగునీరు, పాలు, ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని వారు స్పష్టం చేశారు.

News February 23, 2026

భయపడకండి.. ప్రభుత్వం అండగా ఉంది: మంత్రి దుర్గేశ్

image

రాజమండ్రిలో ప్రజలను కలవరపెడుతున్న అనూరియాపై మంత్రి కందుల దుర్గేశ్ తీవ్రంగా స్పందించారు. ఈ పరిస్థితిపై సోమవారం కలెక్టర్ కీర్తి చేకూరి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టిందని, ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ఆయన భరోసా ఇచ్చారు.