News August 14, 2025
2,3 రోజుల పాటు భారీ వర్షాలు: మంత్రి

భారీ వర్షాలు, సహాయక చర్యలపై కలెక్టర్లు, SPలతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ VCలో జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. మరో 2,3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని, జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News August 14, 2025
‘మహావతార్ నరసింహ’కు భారీగా కలెక్షన్లు

యానిమేటెడ్ సినిమా ‘మహావతార్ నరసింహ’ విడుదలై 20 రోజులైనా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.236.25 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్‌లో రూ.15కోట్లు, భారత్‌లో రూ.221.25 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. ఇవాళ రెండు పెద్ద సినిమాలు(వార్-2, కూలీ) విడుదలైనా బుక్ మై షోలో ఈ మూవీకి గంటకు 6.56k+ టికెట్లు బుక్ అవుతుండటం గమనార్హం.
News August 14, 2025
HNK: రూ.లక్షల్లో డబ్బు స్వాహా.. నిందితుడి అరెస్ట్

క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కమీషన్ తీసుకోకుండా డబ్బులు ఇప్పిస్తానంటూ బాధితుల నుంచి రూ.లక్షల్లో డబ్బు స్వాహా చేసిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన నేరెళ్ల అరుణ్‌ను హన్మకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ట్రాన్సాక్షన్‌కి ఉపయోగించిన మానిటర్, CPU, స్వైపింగ్ మిషన్, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
News August 14, 2025
కర్నూలు ఐపీఎస్ అధికారికి రాష్ట్రపతి మెడల్

కర్నూలుకు చెందిన 2014 బ్యాచ్ ఐపీఎస్ అధికారి డా.జీవీ సందీప్ చక్రవర్తి 6వ రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీకి ఎంపికయ్యారు. రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు. ప్రస్తుతం ఆయన శ్రీనగర్ ఎస్ఎస్పీగా సెంట్రల్ క్యాడర్‌లో పనిచేస్తున్నారు.