News December 21, 2025
2,322 ఉద్యోగాలు.. BIG UPDATE

TG: రాష్ట్రంలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 2,322 ఉద్యోగాలకు గతేడాది నవంబర్ 23న నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే అభ్యర్థుల మార్కులు, ర్యాంకుల జాబితాను సిద్ధం చేసినట్లు ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. పని అనుభవం కలిగిని వారికి వెయిటేజీ పాయింట్లను కలిపి మెరిట్ రూపొందించినట్లు పేర్కొన్నాయి.
Similar News
News December 21, 2025
మహిళలకు స్మార్ట్ కిచెన్‌ల బాధ్యతలు!

AP: మహిళా స్వయం సహాయక సంఘాల(SHG)కు ప్రభుత్వం కీలక బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పక్కాగా అమలు చేసేందుకు వారికి స్మార్ట్ కిచెన్‌ల నిర్వహణను అప్పగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో పలు స్మార్ట్ కిచెన్‌లలో అన్ని పనులను పూర్తిగా మహిళలే పర్యవేక్షిస్తున్నారు. దీంతో త్వరలో మరిన్నింటిని మహిళా సంఘాలకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
News December 21, 2025
బంగ్లాదేశ్ హైకమిషన్ దగ్గర నిరసన.. క్లారిటీ ఇచ్చిన ఇండియా

ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ దగ్గర జరిగిన నిరసనలపై ఇండియా క్లారిటీ ఇచ్చింది. <<18624742>>దీపూ చంద్రదాస్<<>> హత్యను నిరసిస్తూ, బంగ్లాలో మైనారిటీల రక్షణ కోసం అక్కడ కొంతమంది నినదించారని విదేశాంగశాఖ తెలిపింది. సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పింది. బంగ్లా మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దంది. బంగ్లాలో మైనారిటీలపై దాడుల పట్ల ఇండియా తన ఆందోళనను అక్కడి అధికారులకు తెలియజేసింది.
News December 21, 2025
మనం అనుకుంటేనే..

ఏ బంధంలోనైనా మొదట్లో ఉండే ప్రేమ తర్వాత కనిపించదు. చిన్నప్పటి నుంచి ప్రతి అంశంలో నేను అనే భావన ఉంటుంది. అయితే పెళ్లి తర్వాత ఆ భావనను క్రమంగా తగ్గించుకొని మనం అనుకోవాలి. సినిమా, షాపింగ్, స్నేహితులను కలవడానికి భాగస్వామితో కలిసి వెళ్లాలి. అప్పుడే దంపతుల మధ్య దూరం పెరగకుండా ఉంటుంది. పనులెన్నున్నా రోజూ కొంత సమయం జీవితభాగస్వామి కోసం వెచ్చించాలి. కష్ట సుఖాలే కాదు, అభిరుచులు, ఆసక్తి వంటివన్నీ పంచుకోవాలి.


