News July 21, 2024
234 పాఠశాలల్లో ఒక్కరే ఉపాధ్యాయులు

జిల్లాలో ప్రాథమిక విద్యను బోధించేందుకు ఉపాధ్యాయుల కొరత నెలకొంది. కేవలం ఒక్క టీచర్ ఉన్న పాఠశాలలు 234 ఉన్నాయి. విద్యా రంగ పటిష్ఠతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నాయి. ఈ క్రమంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాయి. కానీ, ఉపాధ్యాయుల కొరత సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఏకోపాధ్యాయ పాఠశాలల విద్యార్థులు పటిష్ఠ బోధనకు దూరమవుతున్నారని వివిధ సర్వేలు తేల్చాయి.
Similar News
News November 27, 2025
ఖమ్మం: మీడియా సెంటర్ ప్రారంభించిన అ.కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్ మొదటి అంతస్తులోని ఎఫ్-3లో ఉన్న డీపీఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ను అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి గురువారం ప్రారంభించారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు.
News November 27, 2025
ఖమ్మం: 50 వేల మంది మహిళలకు ‘ఉల్లాస్’ వెలుగులు

15 ఏళ్లు నిండిన నిరక్షరాస్యులైన మహిళలకు సంపూర్ణ అక్షరాస్యత కల్పించేందుకు కేంద్రం ‘ఉల్లాస్’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద జిల్లాలోని డ్వాక్రా మహిళల్లో 50 వేల మందికి పైగా అక్షరాస్యులు కానీ వారిని గుర్తించారు. వీరికి చదవడం, రాయడంతో పాటు జీవన నైపుణ్యాలు నేర్పడానికి ప్రతి 10 మందికి ఒక వలంటీర్‌ను నియమించి, అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీల్లో శిక్షణ ఇస్తున్నారు.
News November 27, 2025
ఖమ్మం: నేటి నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయి. మొదటి దశలో ఏడు మండలాల్లోని 192 గ్రామ పంచాయతీలకు నేటి నుంచి ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కొణిజర్ల, వైరా, మధిర, రఘునాథపాలెం, బోనకల్, చింతకాని, ఎర్రుపాలెం మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


