News May 20, 2024
24నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24నుంచి జూన్ 3వ తేదీ వరకు జరుగుతాయని డీఈవో సుభద్ర చెప్పారు. 24న తెలుగు, కాంపోజిట్ కోర్సు, 25న ద్వితీయ భాష హిందీ, 27న ఇంగ్లీషు, 28న గణితం, 29న ఫిజికల్ సైన్స్, 30న బయాలాజికల్ సైన్స్, 31న సోషల్ స్టడీస్, జూన్ 1న కాంపోజిట్ కోర్సు సేవం- ఓఎస్ఎన్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1, జూన్ 3న ఓఎస్ఎన్ సీ మెయిన్ పరీక్ష జరుగుతుందన్నారు.
Similar News
News December 4, 2025
పోక్సో కేసులను త్వరితగతిన విచారించండి: SP

పోక్సో కేసులను త్వరితగతిన విచారించి పూర్తి చేయాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయం నుంచి ఆయన గురువారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎటువంటి లోపం కనిపించకూడదన్నారు. గంజాయి వంటి మత్తుపదార్థాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
News December 4, 2025
ప్రకాశంలో జోరు తగ్గిన మద్యం.. లెక్కలివే!

ప్రకాశంలో నవంబర్‌కు సంబంధించి మద్యం కొనుగోళ్ల జోరు తగ్గింది. అధికారుల వద్ద ఉన్న లెక్కల మేరకు (కోట్లల్లో).. ఈ ఏడాది జనవరిలో రూ. 105.69, ఫిబ్రవరి రూ. 106.28, మార్చి రూ. 117.41, ఏప్రిల్ రూ.66.5, మే రూ.117.41, జూన్ రూ.110.26, జులై రూ.105.37, ఆగస్ట్ రూ.118.62, సెప్టెంబర్ రూ.111.52, అక్టోబర్ రూ.95.38, నవంబర్ రూ. 86.75 కోట్లల్లో ఆదాయం దక్కింది. డిసెంబర్‌లో ఆదాయం అధికంగా రావచ్చని అధికారుల అంచనా.
News December 3, 2025
మద్దిపాడులో వసతి గృహాలను తనిఖీ చేసిన ప్రకాశం కలెక్టర్

మద్దిపాడులోని SC, ST, BC సంక్షేమ వసతి గృహాలను జిల్లా కలెక్టర్ రాజాబాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ వద్ద విద్యార్థులకు కల్పించిన సౌకర్యాల గురించి కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థుల హాజరు శాతం, పలు రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు సదుపాయాలు కల్పించడంలో అశ్రద్ధవహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


