News June 22, 2024

24న ఒంగోలులో ‘మీకోసం’ కార్యక్రమం

image

ఒంగోలులోని స్పందన హాలు, కలెక్టర్ ఆఫీసు కార్యాలయాలలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు “మీకోసం” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజలు తమ సమస్యలను అధికారులకు అర్జీల ద్వారా తెలియచేయ వచ్చునని పేర్కొన్నారు. అధికారులు సదరు కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు.

Similar News

News November 21, 2025

కురిచేడు: విద్యార్థినులతో టీచర్ అసభ్య ప్రవర్తన

image

కురిచేడు మండలం కల్లూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. 4, 5 తరగతులకు చదువు చెప్పే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలిపారు. ఇదే విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రస్తుతం అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.

News November 21, 2025

కొమరోలు: గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

image

కొమరోలు మండలం తాటిచెర్ల విద్యుత్ శాఖ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.బీకోజీ నాయక్ (42) గుండె పోటులో మృతి చెందారు. ఇతని స్వగ్రామం పుల్లలచెరువు గ్రామం కాగా తాటిచర్ల విద్యుత్ లైన్‌మెన్‌గా కొన్ని ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. కొమరోలు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఉద్యోగులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

News November 21, 2025

సమస్యల పరిష్కారానికి.. ఈ వేళల్లో సంప్రదించండి: డీఈవో

image

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పని దినాలలో తన కార్యాలయం వద్ద సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉంటున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఎంఈవోలు తమ కార్యాలయంలో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ విషయాన్ని ఎంఈవోలు గమనించాలని కోరారు.